సర్కారువారి పాటకు కొత్త తేదీ ఫిక్స్
లెక్కప్రకారం సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి మహేష్ బాబు సినిమా. కానీ తప్పనిసరి పరిస్థితుల మధ్య ఇప్పుడీ సినిమా వాయిదా పడింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహేష్ బాబు స్వయంగా రిలీజ్ డేట్ పోస్టర్ లాంఛ్ చేశాడు. సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే సర్కారువారి పాట యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించింది. సంక్రాంతికి వస్తామంటూ అప్పట్లో పోస్టర్ కూడా రిలీజ్ […]
లెక్కప్రకారం సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి మహేష్ బాబు సినిమా. కానీ తప్పనిసరి పరిస్థితుల మధ్య ఇప్పుడీ సినిమా వాయిదా పడింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహేష్ బాబు స్వయంగా రిలీజ్ డేట్ పోస్టర్ లాంఛ్ చేశాడు.
సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే సర్కారువారి పాట యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించింది. సంక్రాంతికి వస్తామంటూ అప్పట్లో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. దీంతో రాజమౌళి టీమ్ జరిపిన చర్చలతో మహేష్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలా వాయిదా పడిన సినిమాను ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సర్కారువారి పాట. సినిమా షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయింది. తాజాగా స్పెయిన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.