Telugu Global
Cinema & Entertainment

ఒకరు శాకినీ.. మరొకరు డాకినీ

హీరోయిన్లను అప్సరసలతో పోలుస్తారు. మరీ ముద్దొస్తే బాపు బొమ్మగా అభివర్ణిస్తారు. అందానికే అందం అంటూ తెగ హడావుడి చేస్తారు. అయితే దీనికి రివర్స్ లో ఓ హీరోయిన్ ను శాకిని అంటే ఎలా ఉంటుంది. ఇంకో హీరోయిన్ ను డాకినీ అంటే ఎలా ఉంటుంది.. సరిగ్గా అలాంటి సందర్భమే ఇది. ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. […]

ఒకరు శాకినీ.. మరొకరు డాకినీ
X

హీరోయిన్లను అప్సరసలతో పోలుస్తారు. మరీ ముద్దొస్తే బాపు బొమ్మగా అభివర్ణిస్తారు. అందానికే అందం అంటూ తెగ హడావుడి చేస్తారు. అయితే దీనికి రివర్స్ లో ఓ హీరోయిన్ ను శాకిని అంటే ఎలా ఉంటుంది. ఇంకో హీరోయిన్ ను డాకినీ అంటే ఎలా ఉంటుంది.. సరిగ్గా అలాంటి సందర్భమే ఇది.

ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శాకిని డాకిని టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఇలాంటి సినిమాకు ఈ విచిత్రమైన టైటిల్ పెట్టడంతో అందరి దృష్టి దీనిపై పడింది. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరూ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం.

ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

First Published:  3 Nov 2021 2:31 PM IST
Next Story