ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రీసెంట్‌గా స్టార్ట్ చేసి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు. పూనే, సతారా, పల్టాన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. శంకర్ అనగానే భారీతనం ఉన్న సినిమాలే గుర్తుకు వస్తాయి. […]
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రీసెంట్‌గా స్టార్ట్ చేసి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు.
పూనే, సతారా, పల్టాన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. శంకర్ అనగానే భారీతనం ఉన్న సినిమాలే గుర్తుకు వస్తాయి. వాటికి తగ్గట్టుగానే స్టైలిష్‌గా సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రాండ్‌గా చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయంటున్నారు.
మూవీలో రామ్‌చరణ్‌ను శంకర్ సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయబోతున్నారు. ఇటు ప్రేక్షకులను, అటు మెగాభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోకలిసి ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటించిన తర్వాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న చిత్రమిది.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 15వ చిత్రమిది. నిర్మాత దిల్ రాజుకు 50వ మూవీ ఇది. దిల్ రాజు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.