డైరక్టర్ ను ముద్దాడిన రజనీకాంత్
ఊరికే సూపర్ స్టార్స్ అయిపోరు. హిట్స్ రావడంతో పాటు వ్యక్తిత్వం కూడా చాలా అవసరం. ఈ రెండూ ఉన్నాయి కాబట్టే రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. టెక్నీషియన్స్ కు ఆయనిచ్చే గౌరవం వెలకట్టలేనిది అంటారు. తాజాగా దీనికి సంబంధించి మరో ఘటన జరిగింది. తన కొత్త సినిమా అన్నాత్తై దర్శకుడు శివను రజనీకాంత్ కౌగలించుకున్నారు. ముద్దాడి మరీ మెచ్చుకున్నారు. “షూటింగ్ అంతా కూడా సరదాగానే జరిగింది. మంచి సీన్లు చేస్తే.. అందరి ముందే ప్రశంసించేవారు. సినిమా బాగా […]
ఊరికే సూపర్ స్టార్స్ అయిపోరు. హిట్స్ రావడంతో పాటు వ్యక్తిత్వం కూడా చాలా అవసరం. ఈ రెండూ ఉన్నాయి కాబట్టే రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు. టెక్నీషియన్స్ కు ఆయనిచ్చే గౌరవం వెలకట్టలేనిది అంటారు. తాజాగా దీనికి సంబంధించి మరో ఘటన జరిగింది. తన కొత్త సినిమా అన్నాత్తై దర్శకుడు శివను రజనీకాంత్ కౌగలించుకున్నారు. ముద్దాడి మరీ మెచ్చుకున్నారు.
“షూటింగ్ అంతా కూడా సరదాగానే జరిగింది. మంచి సీన్లు చేస్తే.. అందరి ముందే ప్రశంసించేవారు. సినిమా బాగా తీస్తున్నాడని అన్నారు. అయితే కొంత సినిమాను ఎడిట్ చేసి చూపించాను. నా సినిమా చూసినట్టు అనిపిస్తోందని రజినీకాంత్ గారు అన్నారు. ఆ తరువాత సినిమా మొత్తం చూశారు. బయటకు వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోను. ఎంతో సంతృప్తితో ఆయన అలా చేశారు. అదే నాకు అతి పెద్ద ప్రశంస.”
ఇలా తనకు ఎదురైన మధురానుభూతిని మీడియాతో పంచుకున్నాడు దర్శకుడు శివ. రజనీకాంత్ ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తారని, ఆ మంచి మనసే అతడ్ని సూపర్ స్టార్ ను చేసిందంటున్నాడు. తెలుగులో ఈ సినిమా పెద్దన్న పేరుతో రేపు రిలీజ్ అవుతోంది. సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలిగా కీర్తిసురేష్ నటించగా.. హీరోయిన్ గా నయనతార నటించింది.