బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం..
బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి, వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90,089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో డాక్టర్ సుధకు వచ్చిన ఓట్లు 1,11, 710 కాగా.. బీజేపీ అభ్యర్థి సురేష్ కు 21,621 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6205 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక నోటాకు 3635 ఓట్లు రావడం విశేషం. 2019 సార్వత్రిక […]
బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి, వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90,089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
బద్వేల్ ఉప ఎన్నికల్లో డాక్టర్ సుధకు వచ్చిన ఓట్లు 1,11, 710 కాగా.. బీజేపీ అభ్యర్థి సురేష్ కు 21,621 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6205 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక నోటాకు 3635 ఓట్లు రావడం విశేషం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ 44,734 కాగా.. ఉప ఎన్నికల్లో ఏకంగా మెజార్టీ 90వేలు దాటడం విశేషం. టీడీపీ, జనసేన ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.
బద్వేల్ ఉప ఎన్నికల్లో మొదటినుంచీ వైసీపీ విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి. అయితే బీజేపీ గట్టి పోటీ ఇస్తుందా లేదా అనే దానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. మిత్రపక్షం జనసేన తమకి మద్దతిస్తుందని బీజేపీ చెప్పినా కూడా ఆ పార్టీ తరపున నేతలెవరూ ప్రచారానికి రాలేదు, దీంతో జనసేన కార్యకర్తలు కూడా బీజేపీతో కలసి పనిచేయలేదని వారికి వచ్చిన ఓట్ల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఇక టీడీపీ శ్రేణులు కూడా ఈ పోలింగ్ కి పూర్తిగా దూరంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో ఐదోవంతు ఓట్లు మాత్రమే బీజేపీ తెచ్చుకోగలిగింది.
బద్వేల్ లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలు కాగా.. నాలుగున్నర గంటల లోపే పూర్తి స్థాయి ఫలితాలొచ్చేశాయి. మొత్తం ఇక్కడ 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఫస్ట్ రౌండ్ నుంచి వైసీపీ ఆధిక్యం స్పష్టమైంది. చివరకు 90,089 ఓట్ల ఆధిక్యంతో డాక్టర్ సుధ బద్వేలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.