Telugu Global
Cinema & Entertainment

సంతోష్ శోభన్ కామెడీ ఎలా చేశాడు?

మారుతి సినిమాల్లో కామెడీనే హైలెట్ గా ఉంటుంది. హీరో ఎవరైనా కామెడీ చేయాల్సిందే. మరి అందరు హీరోలు కామెడీ చేయగలరా? మంచి రోజులొచ్చాయి సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ కామెడీ ఎలా చేయగలిగాడు? దీనికి సంతోష్ అదిరిపోయే లాజిక్ చెప్పాడు. “సినిమాలో నేను కంప్లీట్ గా మారుతి గారి హీరోలానే కనిపిస్తాను. ఆయన హీరోలు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ మంచి టైమింగ్ తో కామెడీ పండిస్తారు. నేనూ అదే చేశాను. ఆయన కామెడీ టైమింగ్ […]

సంతోష్ శోభన్ కామెడీ ఎలా చేశాడు?
X

మారుతి సినిమాల్లో కామెడీనే హైలెట్ గా ఉంటుంది. హీరో ఎవరైనా కామెడీ చేయాల్సిందే. మరి అందరు హీరోలు కామెడీ చేయగలరా? మంచి రోజులొచ్చాయి సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ కామెడీ ఎలా చేయగలిగాడు? దీనికి సంతోష్ అదిరిపోయే లాజిక్ చెప్పాడు.

“సినిమాలో నేను కంప్లీట్ గా మారుతి గారి హీరోలానే కనిపిస్తాను. ఆయన హీరోలు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ మంచి టైమింగ్ తో కామెడీ పండిస్తారు. నేనూ అదే చేశాను. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన రాసింది రాసినట్టు డెలివరీ చేస్తే చాలు సూపర్ గా వర్కౌట్ అయిపోద్ది. సినిమాలో నా క్యారెక్టర్ కి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే మారుతి గారి లాంటి ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడం నా అదృష్టం.”

ఇలా తను కామెడీ పండించడం వెనక సీక్రెట్ ను బయటపెట్టాడు సంతోష్ శోభన్. మంచి రోజులు వచ్చాయి సినిమా హిలేరియస్ గా ఉంటుందని, ప్రతి సీన్ బాగా నవ్విస్తుందని చెబుతున్నాడు సంతోష్. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది

First Published:  2 Nov 2021 5:01 PM IST
Next Story