మరోసారి రేటు పెంచిన రవితేజ
లాక్ డౌన్ దెబ్బకు టాలీవుడ్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు. ఫలితంగా రెవెన్యూ దెబ్బతింది. దీనికి విరుద్ధంగా కొంతమంది హీరోలు తమ పారితోషికాలు పెంచారు. రవితేజ అయితే మరీనూ. లాక్ డౌన్ తర్వాత ఈ హీరో రెండు సార్లు రెమ్యూనరేషన్ పెంచాడు. క్రాక్ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఒకసారి రెమ్యూనరేషన్ పెంచాడు రవితేజ. క్రాక్ తర్వాత చేస్తున్న ఖిలాడీ సినిమాకు కాస్త రేటు పెంచాడు. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అవ్వకుండానే, […]
లాక్ డౌన్ దెబ్బకు టాలీవుడ్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు. ఫలితంగా రెవెన్యూ దెబ్బతింది. దీనికి విరుద్ధంగా కొంతమంది హీరోలు తమ పారితోషికాలు పెంచారు. రవితేజ అయితే మరీనూ. లాక్ డౌన్ తర్వాత ఈ హీరో రెండు సార్లు రెమ్యూనరేషన్ పెంచాడు.
క్రాక్ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఒకసారి రెమ్యూనరేషన్ పెంచాడు రవితేజ. క్రాక్ తర్వాత చేస్తున్న ఖిలాడీ సినిమాకు కాస్త రేటు పెంచాడు. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అవ్వకుండానే, మరోసారి మాస్ రాజా తన పారితోషికాన్ని సవరించినట్టు వార్తలొస్తున్నాయి.
తాజాగా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు రవితేజ. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం రవితేజ 18 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడనే టాక్ ఉంది. ఇదే కనుక నిజమైతే..ఏడాది కూడా తిరగకముందే రవితేజ తన రెమ్యూరనేషన్ ను రెండుసార్లు పెంచినట్టవుతుంది.