Telugu Global
Cinema & Entertainment

ఆర్యతో అనుబంధాన్ని బయటపెట్టిన విశాల్

ఎనిమి సినిమాతో విశాల్-ఆర్య మరోసారి కలిశారు. కలిసి రెండోసారి మల్టీస్టారర్ చేశారు. అయితే వీళ్ల అనుబంధం సినిమా వరకే పరిమితమా? బయట వీళ్లిద్దరూ ఎలా ఉంటారు? దీనికి విశాల్ స్వయంగా సమాధానం చెప్పాడు. ఆర్యను తన ఆస్తిగా చెప్పుకొచ్చాడు విశాల్. “ఆర్యను ఇప్పుడు వదిలేస్తే ఏలూరు, గుడివాడ..వరకు కూడా సైకిల్‌పై వెళ్తాడు. సైకిల్ మీద 150 కి.మీ వెళ్తాడు. నేను కొన్నిసార్లు నిద్రపోయేది రాత్రి 2 గంటలకు. ఆర్య అప్పుడే రెడీ అవుతాడు. ఆర్య నేను జిమ్‌లో […]

ఆర్యతో అనుబంధాన్ని బయటపెట్టిన విశాల్
X

ఎనిమి సినిమాతో విశాల్-ఆర్య మరోసారి కలిశారు. కలిసి రెండోసారి మల్టీస్టారర్ చేశారు. అయితే వీళ్ల అనుబంధం సినిమా వరకే పరిమితమా? బయట వీళ్లిద్దరూ ఎలా ఉంటారు? దీనికి విశాల్ స్వయంగా సమాధానం చెప్పాడు. ఆర్యను తన ఆస్తిగా చెప్పుకొచ్చాడు విశాల్.

“ఆర్యను ఇప్పుడు వదిలేస్తే ఏలూరు, గుడివాడ..వరకు కూడా సైకిల్‌పై వెళ్తాడు. సైకిల్ మీద 150 కి.మీ వెళ్తాడు. నేను కొన్నిసార్లు నిద్రపోయేది రాత్రి 2 గంటలకు. ఆర్య అప్పుడే రెడీ అవుతాడు. ఆర్య నేను జిమ్‌లో కలిశాం. అప్పుడే నేను ఆర్యతో హీరో అవుతావని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. నాకోసం ఎప్పుడూ ప్రార్థిస్తుంటాడు. ఆర్యను ఎప్పుడు వదిలిపెట్ట‌ను. నా ఆస్తి ఆర్య. లైఫ్‌ను ఎలా తీసుకెళ్లాలో చెప్పాడు ఆర్య. వాడు వీడు సినిమా ఆర్యనే ఇప్పించాడు.”

ఇలా ఆర్యతో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు విశాల్. ఎనిమి సినిమాకు ఆర్య ప్రాణంపోశాడని చెప్పిన విశాల్.. సినిమాలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కంటే తనది, ఆర్య కెమిస్ట్రీనే బాగా వచ్చిందన్నాడు. దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది ఎనిమి మూవీ.

First Published:  1 Nov 2021 2:20 PM IST
Next Story