Telugu Global
NEWS

ఏపీలో మరోసారి ఎన్నికల నగారా..

బద్వేల్ ఉప ఎన్నికల సందడి ముగియకముందే.. మరోసారి ఏపీలో ఎన్నికల నగారా మోగింది. వివిధ కారణాలతో గతంలో మిగిలిపోయిన కార్పొరేషన్, మున్సిపాల్టీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. రాష్ట్రంలోని 12 మున్సిపాల్టీలకు ఈనెల 15న ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించింది. వీటితోపాటు.. పంచాయతీ వార్డులకు, మున్సిపాల్టీ డివిజన్లకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కూడా కొన్నిచోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే.. నెల్లూరు నగర కార్పొరేషన్, […]

ఏపీలో మరోసారి ఎన్నికల నగారా..
X

బద్వేల్ ఉప ఎన్నికల సందడి ముగియకముందే.. మరోసారి ఏపీలో ఎన్నికల నగారా మోగింది. వివిధ కారణాలతో గతంలో మిగిలిపోయిన కార్పొరేషన్, మున్సిపాల్టీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. రాష్ట్రంలోని 12 మున్సిపాల్టీలకు ఈనెల 15న ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించింది. వీటితోపాటు.. పంచాయతీ వార్డులకు, మున్సిపాల్టీ డివిజన్లకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కూడా కొన్నిచోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..
నెల్లూరు నగర కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ విడుదల చేశారు.

7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. 533 పంచాయతీ వార్డులు, 187 ఎంపీటీసీలు, 16 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 69చోట్ల సర్పంచ్ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.

ముఖ్యమైన తేదీలు..
– ఈనెల 3నుంచి 5 వరకు నామినేషన్లు..
– పంచాయతీ వార్డ్ మెంబర్ల స్థానాలకు ఈనెల 14న పోలింగ్, అదేరోజు కౌంటింగ్..
– మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కు ఈనెల 15న పోలింగ్, 17న ఫలితాలు..
– ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈనెల 16న పోలింగ్, 18న ఫలితాలు

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నవంబర్ 29న పోలింగ్ జరుగుతుంది, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

First Published:  1 Nov 2021 11:11 AM IST
Next Story