Telugu Global
Cinema & Entertainment

వాళ్లు అడిగితే నో చెప్పను: మెహ్రీన్

కొందరు దర్శకులపై కొంతమందికి చాలా నమ్మకం ఉంటుంది. కథ కూడా వినకుండా కాల్షీట్లు ఇచ్చేస్తుంటారు. మెహ్రీన్ కు కూడా అలాంటి దర్శకుడు ఒకడు ఉన్నాడు. అతడే మారుతి. ఈ దర్శకుడు కథ చెప్పకపోయినా అతడి సినిమాకు ఓకే చెప్పానని అంటోంది మెహ్రీన్. “ప్రాజెక్టు మీద నమ్మకంతో యు.వి.క్రియేషన్స్ బ్యానర్, మారుతి గారి మీద నమ్మకంతో ఈ కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. మారుతి గారనే కాదు, నా కెరీర్ ఫస్ట్ డైరక్టర్ హను […]

వాళ్లు అడిగితే నో చెప్పను: మెహ్రీన్
X

కొందరు దర్శకులపై కొంతమందికి చాలా నమ్మకం ఉంటుంది. కథ కూడా వినకుండా కాల్షీట్లు ఇచ్చేస్తుంటారు. మెహ్రీన్ కు కూడా అలాంటి దర్శకుడు ఒకడు ఉన్నాడు. అతడే మారుతి. ఈ దర్శకుడు కథ చెప్పకపోయినా అతడి సినిమాకు ఓకే చెప్పానని అంటోంది మెహ్రీన్.

“ప్రాజెక్టు మీద నమ్మకంతో యు.వి.క్రియేషన్స్ బ్యానర్, మారుతి గారి మీద నమ్మకంతో ఈ కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. మారుతి గారనే కాదు, నా కెరీర్ ఫస్ట్ డైరక్టర్ హను రాఘవపూడి కథ చెప్పకపోయినా సినిమాకు ఓకే చెప్పేస్తాను.”

ఇలా ఈ ఇద్దరు దర్శకులపై తనకున్న అభిమానాన్ని, నమ్మకాన్ని బయటపెట్టింది మెహ్రీన్. మరోవైపు తన కెరీర్ కు సంబంధించిన ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఈ బ్యూటీ. ఇకపై గ్లామర్ రోల్స్ తగ్గించి, పెర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తానంటోంది. మహానటిలో కీర్తిసురేష్, ఓ బేబీలో సమంత పోషించిన లాంటి పాత్రలు చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

First Published:  1 Nov 2021 2:25 PM IST
Next Story