Telugu Global
Cinema & Entertainment

మారుతి సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రిలీజ్ ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ పై అప్ డేట్ […]

మారుతి సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్
X

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రిలీజ్ ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ పై ఇప్పుడు భీమవరం టౌన్ ను కూడా యాడ్ చేశారు. అక్కడ కూడా స్పెషల్ పెయిడ్ షోలు పడబోతున్నాయి.

ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ అయిపోయాయి. మిగిలిన చోట్ల కూడా పెయిడ్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వీటితో పాటు హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

First Published:  1 Nov 2021 2:21 PM IST
Next Story