Telugu Global
National

శ్రమజీవులకి కూడా కులవివక్ష అంటగడతారా..?

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం.. గత కొన్నిరోజులుగా ఈ పథకం, దానికి కేంద్రం ఖర్చు చేస్తున్న నిధులపై తీవ్ర చర్చ జరుగుతోంది. నిధులన్నీ ఇచ్చేశాం, ఇక రాష్ట్రాలు తన్నుకు చావండి అంటూ కేంద్రం తెగేసి చెబుతోంది. కరోనా రోజుల్లో కనికరం కూడా చూపించడంలేదు. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే.. శ్రమజీవుల మధ్య కూడా కులంగోడలు కట్టేయడం. ఒకే ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒకే చోట కూలిపనికి వెళ్తే.. ఇద్దరికీ ఒకేరోజు జీతం ఇవ్వడం అనేది […]

శ్రమజీవులకి కూడా కులవివక్ష అంటగడతారా..?
X

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం.. గత కొన్నిరోజులుగా ఈ పథకం, దానికి కేంద్రం ఖర్చు చేస్తున్న నిధులపై తీవ్ర చర్చ జరుగుతోంది. నిధులన్నీ ఇచ్చేశాం, ఇక రాష్ట్రాలు తన్నుకు చావండి అంటూ కేంద్రం తెగేసి చెబుతోంది. కరోనా రోజుల్లో కనికరం కూడా చూపించడంలేదు. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే.. శ్రమజీవుల మధ్య కూడా కులంగోడలు కట్టేయడం. ఒకే ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒకే చోట కూలిపనికి వెళ్తే.. ఇద్దరికీ ఒకేరోజు జీతం ఇవ్వడం అనేది సమన్యాయం. కానీ సామాజిక న్యాయం పేరుతో కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చింది. ఉపాధి హామీ కూలీల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు వారం రోజుల్లోపు బిల్లులు చెల్లిస్తుండగా.. మిగతా వర్గాల వారికి 2 నెలలైనా ఉపాధి డబ్బులు అందడంలేదు. ఇదెక్కడి న్యాయం అంటూ ఇప్పుడు కూలీలు తిరగబడే పరిస్థితులు వచ్చాయి.

మార్చి 2న ఉపాధి హామీ నిధులను ఇలా విభజించి పంచాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది కేంద్రం. ఏప్రిల్ నుంచి మొదలై సెప్టెంబర్ వరకు ఇదే పద్ధతి కొనసాగింది. కేంద్రం విడుదల చేసిన నిధుల్ని తొలి విడతలో ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలి, ఆ తర్వాత నింపాదిగా విడుదలయ్యే నిధుల్ని మిగతా వర్గాల అకౌంట్లలో వెయ్యాలి. కానీ ఈ అంతరం బాగా పెరిగిపోవడం.. ఎస్సీ ఎస్టీలు తొలి రెండు వారాల్లో డబ్బులు తీసుకుంటుండగా.. మిగతా వర్గాలు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విభజించు, పాలించి అనే పద్ధతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు ఉపాధి కూలీల కార్మిక సంఘాల నేతలు. గతంలో అందరికోసం పోరాటం చేశామని, ఇప్పుడు అందరిలో కొందరికోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని చెబుతున్నారు.

నిధులు లేకే.. నిబంధనలు..
ఉపాధి హామీ పథకానికి కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్ని కూడా సక్రమంగా విడుదల చేయడంలేదు. పదే పదే రాష్ట్రాలు ప్రాథేయపడితేనే పని అవుతోంది. అందులోనూ.. అరకొర నిధులు విదిల్చి.. అడ్డదిడ్డమైన రూల్స్ పెడుతోంది. తొలి విడత ఇచ్చిన నిధుల్ని ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని, ఆ తర్వాత వచ్చే వాటిని మిగతా వర్గాలకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. దీంతో రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బీహార్, కర్నాటక, తమిళనాడులో కూలీలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్టోబర్ 11న జరిగిన ఓ సమావేశంలో కూడా ఈ నిబంధనపై రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తరపున కూడా గ్రామీణాభివృద్ధి శాఖపై ఒత్తిడి పెరిగింది. కనీసం దీపావళి పండగ సందర్భంగా అయినా సమన్యాయం పాటించడంలేదని.. ఎస్సీ, ఎస్టీలకు డబ్బులిచ్చారు కానీ, ఇతర వర్గాలకు మొండిచేయి చూపించారని అంటున్నారు.

First Published:  31 Oct 2021 9:55 PM GMT
Next Story