ఓటీటీలోకి కాదు.. వెండితెరపైకి..!
నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి`. ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా సభ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందింది. నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేద్దామనుకున్నారు. మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ మనసు మార్చుకొని ఇప్పుడు […]
నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా సభ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందింది. నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేద్దామనుకున్నారు. మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ మనసు మార్చుకొని ఇప్పుడు థియేటర్లలోకి వస్తున్నారు.
కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. 26న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో కీర్తి సురేష్ తన టార్గెట్‌కు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఆ పోస్టర్‌లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా కనిపిస్తున్నారు.
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న 'గుడ్ లక్ సఖి' సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.