లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం
హీరో నాగశౌర్య బాంబ్ పేల్చాడు. లవ్ స్టోరీస్ కు పెర్ ఫెక్ట్ గా సూటయ్యే ఈ హీరో, ఇకపై అలాంటి కథల్లో నటించనని చెప్పేశాడు. ఇకపై మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తానని, లవర్ బాయ్ పాత్రలకు దూరమని కుండబద్దలు కొట్టాడు. “వరుడు కావలెను చిత్రంతో మీకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. అయితే ఇకపై మాత్రం ఇదే ఇమేజ్ కొనసాగించను. నేను లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం. ఎందుకంటే హీరోగా అన్ని రకాల కథలు, […]
హీరో నాగశౌర్య బాంబ్ పేల్చాడు. లవ్ స్టోరీస్ కు పెర్ ఫెక్ట్ గా సూటయ్యే ఈ హీరో, ఇకపై అలాంటి కథల్లో నటించనని చెప్పేశాడు. ఇకపై మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తానని, లవర్ బాయ్ పాత్రలకు దూరమని కుండబద్దలు కొట్టాడు.
“వరుడు కావలెను చిత్రంతో మీకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. అయితే ఇకపై మాత్రం ఇదే ఇమేజ్ కొనసాగించను. నేను లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం. ఎందుకంటే హీరోగా అన్ని రకాల కథలు, పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను”
ఇలా తన మనసులో మాట బయటపెట్టాడు నాగశౌర్య. వరుడు కావలెను సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఈ హీరో.. తన తాజా చిత్రం హిట్ అవుతుందనే విషయం తనకు ముందే తెలుసన్నాడు. వరుడు కావలెను హిట్ అవుతుందని తను బలంగా నమ్మానని, ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారని అన్నాడు.