Telugu Global
National

గుజరాత్ లో దారుణం..రామ మందిరంలోకి ప్రవేశించారంటూ దళితులపై దాడి..!

ఒకప్పుడు సమాజంలో కుల వివక్ష ఒక స్థాయిలో ఉండేది. క్రమేణా అది తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన సమాజంలో కుల వివక్ష ఇంకా ఉందని తెలియజేస్తోంది.ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో ఈ దారుణ సంఘటన జరగడం సంచలనంగా మారింది. ఉత్సవాలు జరుగుతున్న రామ మందిరంలోకి దళితులు అడుగు పెట్టడంతో అగ్రవర్ణాలవారు ఆగ్రహంతో ఊగిపోయారు. విచక్షణ మరచి వారిని దారుణంగా చావబాదారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్ రాష్ట్రం […]

గుజరాత్ లో దారుణం..రామ మందిరంలోకి ప్రవేశించారంటూ దళితులపై దాడి..!
X

ఒకప్పుడు సమాజంలో కుల వివక్ష ఒక స్థాయిలో ఉండేది. క్రమేణా అది తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన సమాజంలో కుల వివక్ష ఇంకా ఉందని తెలియజేస్తోంది.ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో ఈ దారుణ సంఘటన జరగడం సంచలనంగా మారింది. ఉత్సవాలు జరుగుతున్న రామ మందిరంలోకి దళితులు అడుగు పెట్టడంతో అగ్రవర్ణాలవారు ఆగ్రహంతో ఊగిపోయారు. విచక్షణ మరచి వారిని దారుణంగా చావబాదారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా బచువా తాలూకాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఒక వర్గానికి చెందిన ప్రజలు రామాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను చూసేందుకు కొందరు దళితులు కూడా వచ్చారు. అది గమనించిన అగ్రవర్ణాల వారు దళితులను చితకబాదారు. వృద్ధుల‌ పట్ల కూడా కనికరం చూపకుండా రక్తం కారేలా కొట్టారు.

అగ్రవర్ణాలకు చెందిన 20 మంది ఈ దాడి చేశారు.ఈ దాడికి సంబంధించి ఫొటోలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దాడి వెనుక భూ వివాదం కూడా ఒక కారణమని స్థానికులు చెబుతున్నారు. ఒక అగ్రవర్ణకుటుంబం, ఆ దళితుడి కుటుంబం మధ్య ఏళ్లుగా భూవివాదం కొనసాగుతోందని, రామాలయంలోకి వచ్చారనే నెపంతో ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని అంటున్నారు.

అందుకే అగ్ర వర్ణాల దాడిలో ఒక కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయలైనట్లు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

First Published:  30 Oct 2021 7:56 AM GMT
Next Story