Telugu Global
National

పంజాబ్ లో బీజేపీ సిక్కు స్ట్రాటజీ.. అమరీందర్ కు బిగ్ షాక్..

కొత్తగా పార్టీ పెడుతున్నా.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటానంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన 24గంటల్లోగా.. ఆ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని అధిష్టానం విస్పష్ట ప్రకటన చేసింది. దీంతో అమరీందర్ షాకయ్యారు. మరోవైపు పంజాబ్ కేంద్రంగా రైతుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగుస్తున్న నేపథ్యంలో బీజేపీ సోలోగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం విపక్షాలకు కూడా ఊహించని పరిణామమే. రైతు చట్టాలను రద్దు చేయకుండానే పంజాబ్ బరిలో […]

పంజాబ్ లో బీజేపీ సిక్కు స్ట్రాటజీ.. అమరీందర్ కు బిగ్ షాక్..
X

కొత్తగా పార్టీ పెడుతున్నా.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటానంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన 24గంటల్లోగా.. ఆ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని అధిష్టానం విస్పష్ట ప్రకటన చేసింది. దీంతో అమరీందర్ షాకయ్యారు. మరోవైపు పంజాబ్ కేంద్రంగా రైతుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగుస్తున్న నేపథ్యంలో బీజేపీ సోలోగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం విపక్షాలకు కూడా ఊహించని పరిణామమే. రైతు చట్టాలను రద్దు చేయకుండానే పంజాబ్ బరిలో దిగేందుకు బీజేపీ స్థిర నిర్ణయం తీసుకుంది. మొత్తం 117 అసెంబ్లీ స్తానాల్లో పోటీ చేస్తున్నట్టు తేల్చి చెప్పింది.

సిక్కు స్ట్రాటజీ..
పంజాబ్ లో రైతులు, సిక్కుల్ని వేర్వేరుగా చూడలేం. కానీ సిక్కు వర్గాన్ని మాత్రం తమకి అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. తద్వారా రైతుల్లో బీజేపీపై పెరిగిపోయిన వ్యతిరేకతను కాస్తయినా తగ్గించుకుంటామంటోంది. బీజేపీతో కొత్త పంజాబ్ (నవన్ పంజాబ్ – బీజేపీదే నాల్) అనే అర్థం వచ్చేలా స్లోగన్లు ఇస్తున్నారు కమలనాథులు. గత ఏడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిక్కు వర్గానికి చేసిన ఉపకారాలను ప్రస్తావిస్తూ ప్రచార సంరంభాన్ని ప్రారంబిస్తామమంటున్నారు కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్ చార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్.
పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాబిహ్ గురుద్వారాకోసం కర్తార్ పూర్ కారిడార్ ఏర్పాటు చేయడాన్ని ఇందులో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పంజాబ్ కి అతి సమీపంలోను ఉన్న సాహిబ్ గురుద్వారాకు వెళ్లాలంటే.. దేశం మొత్తం చుట్టి వెళ్లాల్సిన సందర్భంలో.. నేరుగా గురుద్వారా సందర్శించే సిక్కులకోసం కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. వంట పాత్రల అమ్మకాలు కొనసాగించే లంగర్ కమ్యూనిటీకి జీఎస్టీనుంచి మినహాయింపునివ్వడం మరొకటి. స్వర్ణ దేవాలయం కోసం స్వీకరించే విదేశీ విరాళాలపై ఆంక్షలు ఎత్తివేయడాన్ని కూడా సిక్కులపై తమకున్న ప్రేమకు నిదర్శనంగా చెబుతోంది బీజేపీ. అదే సమయంలో బీఎస్ఎఫ్ పరిధి పెంచుతూ తీసుకున్న నిర్ణయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆ పార్టీ నేతలు.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శిరోమణి అకాళీదల్ వంటి పార్టీలు.. స్థానికంగా ఉన్న అవసరాలను తీర్చలేని సందర్భంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా తెరపైకి వస్తోందని అంటున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ చివరి నిముషంలో దళిత ముఖ్యమంత్రిని ఎంపిక చేసి ఆయా వర్గాలను ఆకట్టుకునేలా రాజకీయం నడిపితే.. బీజేపీ.. సిక్కు స్ట్రాటజీని తెరపైకి తెస్తోంది. రైతుల్లో తమపై పెరిగిపోతున్న వ్యతిరేకతను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. పొత్తుల్లేకుండానే ఒంటరిగా 117 స్థానాల్లో బీజేపీ పోటీ చేయడానికి సిద్ధమైంది.

First Published:  29 Oct 2021 5:19 AM IST
Next Story