భీమ్లా నాయక్ లో మరో హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడీ ఇద్దరు కాకుండా మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె పేరు సంయుక్త. భీమ్లానాయక్ లో కీలకమైన మరో పాత్ర ఉంది. అది రానా చెల్లెలు పాత్ర. బహుశా ఈ పాత్ర కోసం మలయాళీ బ్యూటీ సంయుక్తను తీసుకున్నట్టున్నారు. త్వరలోనే ఈ పాత్రపై క్లారిటీ రాబోతోంది. సాగర్ […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడీ ఇద్దరు కాకుండా మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె పేరు సంయుక్త.
భీమ్లానాయక్ లో కీలకమైన మరో పాత్ర ఉంది. అది రానా చెల్లెలు పాత్ర. బహుశా ఈ పాత్ర కోసం మలయాళీ బ్యూటీ సంయుక్తను తీసుకున్నట్టున్నారు. త్వరలోనే ఈ పాత్రపై క్లారిటీ రాబోతోంది.
సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్.. స్క్రీన్ ప్లే, మాటలు
అందిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి
రాబోతున్నాడు భీమ్లానాయక్.