Telugu Global
Cinema & Entertainment

తన పెళ్లిపై స్పందించిన నాగశౌర్య

హీరో నాగశౌర్య పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? ఈ ప్రశ్నకు స్వయంగా అతడే సమాధానం చెప్పాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో తను చెప్పలేనని, కానీ పెళ్లి తర్వాత తన భార్యను మాత్రం బాగా చూసుకుంటానంటున్నాడు. “కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. నా పెళ్లి విషయంలో నాకు పెద్దగా ప్లాన్స్‌ ఏమీ లేవు. మనం ఎంత ప్లాన్‌ చేసిన పెళ్లి విషయంలో రాసి పెట్టిందే జరుగుతుంది. వచ్చిన భార్యను బాగా చూసుకోవాలి. తనకు ప్రైవసీ ఇవ్వాలి. ఆమె ఫ్రొషెషన్‌కు గౌరవం ఇవ్వాలి. […]

తన పెళ్లిపై స్పందించిన నాగశౌర్య
X

హీరో నాగశౌర్య పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? ఈ ప్రశ్నకు స్వయంగా అతడే సమాధానం చెప్పాడు. పెళ్లి
ఎప్పుడు అవుతుందో తను చెప్పలేనని, కానీ పెళ్లి తర్వాత తన భార్యను మాత్రం బాగా
చూసుకుంటానంటున్నాడు.

“కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. నా పెళ్లి విషయంలో నాకు పెద్దగా ప్లాన్స్‌ ఏమీ లేవు. మనం ఎంత ప్లాన్‌ చేసిన పెళ్లి విషయంలో రాసి పెట్టిందే జరుగుతుంది. వచ్చిన భార్యను బాగా చూసుకోవాలి. తనకు ప్రైవసీ ఇవ్వాలి. ఆమె ఫ్రొషెషన్‌కు గౌరవం ఇవ్వాలి. ఫైనల్‌గా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అంతే!”

ఇలా పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు నాగశౌర్య. ఈ సందర్భంగా వరుడు కావలెను సినిమాకు
సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటపెట్టాడు. ఈ సినిమాలో ఓ సీన్ ను స్వయంగా త్రివిక్రమ్
రాశాడట. ఆ సీన్ కు డైలాగ్స్ కూడా త్రివిక్రమే ఇచ్చాడట. ఆ సీన్ సినిమాకు హైలెట్ అంటున్నాడు నాగశౌర్య.

First Published:  28 Oct 2021 3:20 PM IST
Next Story