మళ్లీ మొదలైందంటున్న మహేష్
మహేష్ బాబు మళ్లీ మొదలుపెట్టాడు. ఇదేదో ఆయన కొత్త సినిమా కాదు. సుమంత్ హీరోగా నటించిన సినిమా. ఈ హీరో నటించిన మళ్లీ మొదలైంది అనే సినిమా ట్రయిలర్ ను మహేష్ బాబు లాంఛ్ చేశారు. మహేష్ చేతుల మీదుగా రిలీజ్ అవ్వడంతో ఈ ట్రయిలర్ కు మంచి బజ్ వచ్చింది. ఇక ట్రయిలర్ విషయానికొస్తే, సుమంత్ మరోసారి ఫీల్ గుడ్ సినిమా చేశాడనిపిస్తోంది. మళ్లీ రావా తర్వాత ఆ స్థాయిలో అంచనాలు అందుకుంది మళ్లీ మొదలైంది సినిమా. హీరో సుమంత్ […]
మహేష్ బాబు మళ్లీ మొదలుపెట్టాడు. ఇదేదో ఆయన కొత్త సినిమా కాదు. సుమంత్ హీరోగా నటించిన సినిమా. ఈ హీరో నటించిన మళ్లీ మొదలైంది అనే సినిమా ట్రయిలర్ ను మహేష్ బాబు లాంఛ్ చేశారు. మహేష్ చేతుల మీదుగా రిలీజ్ అవ్వడంతో ఈ ట్రయిలర్ కు మంచి బజ్ వచ్చింది.
ఇక ట్రయిలర్ విషయానికొస్తే, సుమంత్ మరోసారి ఫీల్ గుడ్ సినిమా చేశాడనిపిస్తోంది. మళ్లీ రావా తర్వాత ఆ స్థాయిలో అంచనాలు అందుకుంది మళ్లీ మొదలైంది సినిమా. హీరో సుమంత్ కు విడాకులవ్వడం, ఆ తర్వాత ఆ విడాకులిచ్చిన లాయర్ తోనే సుమంత్ ప్రేమలో పడడం, ఆ లాయరమ్మ, సుమంత్ పై ప్రేమను పెంచుకోవడం, మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు లాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.
ట్రయిలర్ లో ఎమోషన్ ఎంత ఉందో, ఫన్ కూడా అంతే కనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శివ సినిమాటోగ్రఫీ ట్రయిలర్ లో హైలెట్ గా నిలిచాయి. టీజీ కీర్తికుమార్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.