ఏపీలో పార్టీ పెట్టండి.. రెండు రాష్ట్రాలెందుకు కలిపేద్దాం.. కేసీఆర్ కు పేర్ని నాని చురకలు
ఆంధ్రప్రదేశ్లో కూడా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలంటూ వేల మంది కోరారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నిన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ కు చురకలంటించగా.. తాజాగా మంత్రి పేర్నినాని కౌంటర్లు ఇచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘అసలు రెండు రాష్ట్రాలు ఎందుకు? కలిపేస్తే సరిపోదా? ఆంధ్రప్రదేశ్ […]
ఆంధ్రప్రదేశ్లో కూడా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలంటూ వేల మంది కోరారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నిన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ కు చురకలంటించగా.. తాజాగా మంత్రి పేర్నినాని కౌంటర్లు ఇచ్చారు.
ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘అసలు రెండు రాష్ట్రాలు ఎందుకు? కలిపేస్తే సరిపోదా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలిపేందుకు కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి’ అంటూ కౌంటర్ వేశారు నాని. 2013లో వైఎస్ జగన్ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకున్నారని.. .ఇప్పుడు విడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు.
తెలుగు రాష్ట్రాలను అన్యాయంగా విడగొడుతున్నారని విడగొట్టవద్దని.. సీఎం జగన్ పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన విషయాన్ని మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ పథకాలను కాపీ కొడుతోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కొన్ని ప్రాంతాలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ నేతలు కేసీఆర్ పై కౌంటర్లు వేస్తున్నారు.