Telugu Global
National

పెగాసస్ విచారణకు సుప్రీం కమిటీ..

పెగాసస్‌ స్పైవేర్‌ తో భారత్ లోని ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌ చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. నిపుణుల కమిటీ పనితీరును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను కోర్టుకు సమర్పించాలని కమిటీని […]

పెగాసస్ విచారణకు సుప్రీం కమిటీ..
X

పెగాసస్‌ స్పైవేర్‌ తో భారత్ లోని ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌ చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. నిపుణుల కమిటీ పనితీరును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను కోర్టుకు సమర్పించాలని కమిటీని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌న్న కేంద్రం ప్ర‌తిపాద‌న‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాతీయ భ‌ద్ర‌త పేరుతో కేంద్రం బాధ్య‌త నుంచి త‌ప్పించుకోలేద‌ని, కేంద్రం త‌న బాధ్య‌త‌ను నిర్వ‌హించాల్సి ఉంద‌ని సుప్రీం కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ అసంపూర్ణంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయట్లేదని కేంద్రం ఇప్పటికే న్యాయస్థానానికి తెలిపింది. దీంతో స్వతంత్ర నిపుణుల కమిటీకి సుప్రీం మొగ్గు చూపింది. దేశ పౌరులపై వివక్షపూరితమైన నిఘాను తాము అనుమతించబోమని సుప్రీం వెల్లడించింది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ సహా.. పలువురు రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు, జర్నలిస్ట్ లు.. ఇలా దాదాపు 300మంది ఫోన్లు హ్యాకింగ్ కి గురైనట్టు వార్తలొచ్చాయి. దీనిపై పార్లమెంట్ లో ప్రతిపక్షం గొడవ చేసింది. ఈ వ్యవహారంపై నమోదైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. స్వతంత్ర దర్యాప్తుకి కమిటీ ఏర్పాటు చేసింది.

First Published:  27 Oct 2021 3:47 AM GMT
Next Story