పెళ్లిపై స్పందించిన హీరోయిన్
హీరోయిన్లు మీడియా ముందుకొస్తే కామన్ గా ఎదురయ్యే ప్రశ్న “పెళ్లి ఎప్పుడు?”. ఈ కామన్ ప్రశ్నకు అంతే కామన్ గా సమాధానం ఇస్తుంటారు హీరోయిన్లు. తాజాగా హీరోయిన్ రీతూ వర్మ కూడా ఇలానే స్పందించింది. తన పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందంటోంది. “నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా రెండు మూడేళ్ళు పట్టొచ్చు. ఇంట్లో ఆ టాపిక్ గురించి నన్ను ఇబ్బంది పెట్టరు. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు తప్ప ఆ విషయాన్ని నాకే వదిలేశారు.” […]
హీరోయిన్లు మీడియా ముందుకొస్తే కామన్ గా ఎదురయ్యే ప్రశ్న “పెళ్లి ఎప్పుడు?”. ఈ కామన్ ప్రశ్నకు అంతే
కామన్ గా సమాధానం ఇస్తుంటారు హీరోయిన్లు. తాజాగా హీరోయిన్ రీతూ వర్మ కూడా ఇలానే స్పందించింది. తన పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందంటోంది.
“నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా రెండు మూడేళ్ళు పట్టొచ్చు. ఇంట్లో ఆ టాపిక్ గురించి నన్ను
ఇబ్బంది పెట్టరు. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు తప్ప ఆ విషయాన్ని నాకే వదిలేశారు.”
ఇలా తన పెళ్లిపై సూటిగా స్పందించింది రీతూ వర్మ. ఇదే టైమ్ లో తన లవ్ ఎఫైర్లు, డేటింగ్స్ పై కూడా
రియాక్ట్ అయింది. ప్రస్తుతం తను లవ్ లో లేనని, సింగిల్ లైఫ్ ను సుఖంగా లీడ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఆమె నటించిన వరుడు కావలెను సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా
మీడియాతో మాట్లాడిన రీతూ ఇలా తన పెళ్లి, వ్యక్తిగత విషయాలపై స్పందించింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే శర్వానంద్ తో చేసిన సినిమా థియేటర్లలోకి వస్తుందని తెలిపింది రీతూ.