Telugu Global
Cinema & Entertainment

టైటిల్ సాంగ్.. ఇనిస్టెంట్ గా హిట్

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, టీజర్‌, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆద్యంతం వినోదాల విందుగా ఈ పాట సాగింది. మంచి రోజులు వచ్చాయి అంటూ సాగే లిరిక్ చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఇస్తుంది. సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా […]

టైటిల్ సాంగ్.. ఇనిస్టెంట్ గా హిట్
X

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, టీజర్‌, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఆద్యంతం వినోదాల విందుగా ఈ పాట సాగింది. మంచి రోజులు వచ్చాయి అంటూ సాగే లిరిక్ చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఇస్తుంది. సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. అలాగే అజయ్ ఘోష్ కూడా ఈ పాటలో హైలైట్ అయ్యారు. లిరికల్ వీడియోలో సాహిత్యాన్ని తెలుగులో టైపు చేయడం, మేకింగ్ వీడియోతో లిరికల్ వీడియో చేయడం ఆకట్టుకుంది.

దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. మెహ్రీన్ ఇందులో హీరోయిన్. మహానుభావుడు తర్వాత మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ చేస్తున్న రెండో సినిమా ఇది.

First Published:  27 Oct 2021 1:04 PM IST
Next Story