ఆఫ్ఘనిస్తాన్ లో పనికి ఆహార పథకం..
ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం.. నిరంకుశ విధానాలతోపాటు పౌరుల కష్ట సుఖాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తాలిబన్ల ఆక్రమణ తర్వాత అంతర్జాతీయ సహకారం ఆగిపోవడంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్ర దుర్భర పరిస్థితులున్నాయి. పేదవారికి తిండిగింజలు దొరకడంలేదు. మరోవైపు నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. పేదరికం, కరువు, కరెంటు ఉత్పత్తి లేకపోవడం వంటి సమస్యతో ఆఫ్ఘనిస్తాన్ సతమతం అవుతోంది. నిరుపేదలు ఆకలితో అల్లాడిపోతుండే సరికి తాలిబన్ ప్రభుత్వం పనికి ఆహార పథకం తీసుకొచ్చింది. […]
ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం.. నిరంకుశ విధానాలతోపాటు పౌరుల కష్ట సుఖాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తాలిబన్ల ఆక్రమణ తర్వాత అంతర్జాతీయ సహకారం ఆగిపోవడంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్ర దుర్భర పరిస్థితులున్నాయి. పేదవారికి తిండిగింజలు దొరకడంలేదు. మరోవైపు నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. పేదరికం, కరువు, కరెంటు ఉత్పత్తి లేకపోవడం వంటి సమస్యతో ఆఫ్ఘనిస్తాన్ సతమతం అవుతోంది. నిరుపేదలు ఆకలితో అల్లాడిపోతుండే సరికి తాలిబన్ ప్రభుత్వం పనికి ఆహార పథకం తీసుకొచ్చింది. నిరుపేదలకు ప్రభుత్వం తరపున ఉపాధి కల్పిస్తూ.. వారికి గోధుమలను అందిస్తోంది.
ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క కాబూల్ లోనే ఇలా 40వేలమందికి ఉపాధి చూపించి, జీతం బదులుగా గోధుమలను ఇస్తోంది ప్రభుత్వం. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిదిన్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆప్ఘనిస్తాన్ లోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలంటే ఇలాంటి పథకాల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అసంఘటిత రంగంలోని పేదలకు తాత్కాలికంగా ఉద్యోగాలు చూపించే పరిస్థితి ఆఫ్ఘన్ లో లేదు, ఒకవేళ అలా ఉపాధి చూపించినా వారికి జీతాలివ్వడం తలకు మించిన భారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం తరపున మంచినీటి పైప్ లైన్ల నిర్మాణం, డ్రైనేజీల తవ్వకం వంటి పనులు చేయిస్తూ.. గోధుమలు అందిస్తున్నారు.
చలికాలంలో తీవ్ర ఇబ్బందులు..
ఆఫ్ఘనిస్తాన్ లో చలికాలం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. వ్యవసాయ పనులు తగ్గిపోయి, ఉపాధి కరువైపోతుంది. మరోవైపు స్థానికంగా ఉద్యోగిత అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ప్రజల ఇబ్బందుల్ని గ్రహించిన ప్రభుత్వం పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చింది. 66,600 టన్నుల ధాన్యాన్ని అందిస్తూ.. పేదలతో చిన్న చిన్న పనులు చేయించుకుంటోంది.