'బ్యాచిలర్' పార్టీ ఇచ్చిన నాగార్జున
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన సినిమా మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రం అక్టోబర్ 15న విజయదశమి సందర్బంగా విడుదలైంది. మహాసముద్రం, పెళ్లి సందడి సినిమాలు వచ్చినప్పటికీ దసరా హిట్ గా నిలిచిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే. ప్రారంభంలో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఊహించని విధంగా పుంజుకుంది. మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రానికి గొపిసుందర్ అందించిన ఆడియో సూపర్బ్ […]
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన
సినిమా మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రం అక్టోబర్ 15న విజయదశమి సందర్బంగా విడుదలైంది.
మహాసముద్రం, పెళ్లి సందడి సినిమాలు వచ్చినప్పటికీ దసరా హిట్ గా నిలిచిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్
బ్యాచిలర్ మాత్రమే.
ప్రారంభంలో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఊహించని విధంగా పుంజుకుంది. మంచి వసూళ్లు
రాబడుతోంది. ఈ చిత్రానికి గొపిసుందర్ అందించిన ఆడియో సూపర్బ్ సక్సెస్ అయింది. ఇప్పటికే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి అఖిల్ అక్కినేని కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిలవటం విశేషం.
దీంతో ఈ సినిమా సక్సెస్ ను నాగార్జున కూడా సెలబ్రేట్ చేశాడు. మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం ని
అభినందిస్తూ.. ఆయనే హోస్ట్ గా సెలబ్రెట్ చేశాడు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, రాహుల్ రవీంద్రన్, సుబ్బు, వెంకి అట్లూరి, డాలీ హజరయ్యారు. తన కొడుక్కి హిట్ ఇచ్చినందుకు యూనిట్ మొత్తానికి థ్యాంక్స్ చెప్పాడు నాగ్.