Telugu Global
NEWS

పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..!

టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని పట్టాభి అసభ్యపదజాలంతో దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన ఫిర్యాదు మేరకు అతడిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదైంది. […]

పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..!
X

టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని పట్టాభి అసభ్యపదజాలంతో దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అందిన ఫిర్యాదు మేరకు అతడిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదైంది.

పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు ముందుగా ఆయనను కృష్ణా జిల్లా తోట్లవల్లూరు తీసుకువచ్చారు. గురువారం మధ్యాహ్నం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు.విజయవాడలోని జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తనఇంటిపై పలుమార్లు దాడి జరిగిందని కోర్టుకు వివరించారు. తాను సీఎం ముఖ్యమంత్రి జగన్ ను గానీ ప్రభుత్వంలో ఉన్న వారిని గానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని చెప్పుకొచ్చారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియా ముందు ప్రస్తావించానని న్యాయమూర్తికి వివరించారు.

ఇదిలా ఉండగా..తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పట్టాభిని తరలించే క్రమంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పటిష్ట బందోబస్తు నడుమ పట్టాభిని విజయవాడ తీసుకువచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా..నవంబర్ 2 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ బంద్ నేపథ్యంలో పోలీసులు నాదెండ్ల బ్రహ్మంను అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం ఆయనను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా బ్రహ్మంకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

First Published:  21 Oct 2021 1:52 PM IST
Next Story