Telugu Global
National

పీకే చూపు.. టీఎంసీ వైపు..!

2012లో గుజరాత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ రాజకీయ సలహాదారుగా పనిచేసి ఆ పార్టీ అక్కడ విజయం సాధించి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చేందుకు పీకే తోడ్పడ్డాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. పలు పార్టీలు ఆయనను తమ రాజకీయ సలహాదారుగా నియమించుకున్నాయి. […]

పీకే చూపు.. టీఎంసీ వైపు..!
X

2012లో గుజరాత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ రాజకీయ సలహాదారుగా పనిచేసి ఆ పార్టీ అక్కడ విజయం సాధించి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చేందుకు పీకే తోడ్పడ్డాడు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. పలు పార్టీలు ఆయనను తమ రాజకీయ సలహాదారుగా నియమించుకున్నాయి. ఏపీలో జగన్ సీఎం కావడానికి, తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది.

ఎన్నికల వ్యూహకర్తగా అద్భుతంగా రాణించిన పీకే .. పూర్తిస్థాయి రాజకీయవేత్తగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో జేడీయూలో చేరినప్పటికీ వివిధ కారణాల వల్ల బయటకు వచ్చేశారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఏపీలోని వైసీపీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు.

ఇదిలా ఉంటే పీకే.. కొంతకాలం క్రితం కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారని ప్రచారం సాగింది. సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా, పార్టీలోనూ ఆయన కీలక నాయకుడిగా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరడం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ రాకను కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

ఆయనను కేవలం వ్యూహకర్తగానే నియమించుకోవాలని.. పార్టీలో కీలక పదవులు ఇవ్వకూడదని వారు గట్టిగా వాదిస్తున్నారట. దీంతో పీకే .. తృణమూల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. దీనిపై జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పీకే కాంగ్రెస్ లో చేరతారా? తృణమూల్ కాంగ్రెస్ వైపు చూస్తారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

First Published:  21 Oct 2021 8:44 AM IST
Next Story