నాని నుంచి అప్పుడే మరో సినిమా
నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. సినిమాలో శ్యామ్ సింగరాయ్‌గా నాని ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. బెంగాలీ కుర్రాడిలా కనిపించిన పోస్టర్, దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వాసు పోస్టర్ రెండూ కూడా అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. రెండు పాత్రలకు ఎక్కడా కూడా సంబంధం లేనట్టు కనిపిస్తోంది. పోస్టర్లతోనే సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. సినిమా మీదున్న బజ్ దృష్ట్యా తెలుగు,తమిళ, కన్నడ, మళయాల భాషల్లో […]
నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. సినిమాలో శ్యామ్ సింగరాయ్‌గా నాని ఫస్ట్ లుక్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. బెంగాలీ కుర్రాడిలా కనిపించిన పోస్టర్, దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వాసు పోస్టర్ రెండూ కూడా అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. రెండు పాత్రలకు ఎక్కడా కూడా సంబంధం లేనట్టు కనిపిస్తోంది. పోస్టర్లతోనే సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.
సినిమా మీదున్న బజ్ దృష్ట్యా తెలుగు,తమిళ, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవి, నానిలపై ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. పీరియడ్ జోన్‌లో సాయి పల్లవి, నానిల మధ్య అద్భుతమైన ప్రేమ కథ ఉండబోతోందని పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది.
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లకు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అది సినిమాకు ప్లస్ కానుంది. రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా నాని నుంచి టక్ జగదీష్ సినిమా వచ్చింది.