మరో 2 రోజుల్లో సెట్స్ పైకి రామ్ చరణ్
ఇన్నాళ్లూ గ్యాప్ తీసుకున్న హీరో రామ్ చరణ్ ఇప్పుడు సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈనెల 22నుంచి తన కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమా ఆల్రెడీ లాంఛ్ అయింది. ఇప్పుడా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. 22న పూణెలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ ను దాదాపు 3 వారాలు ప్లాన్ చేశారు. హీరోహీరోయిన్లు రామ్ చరణ్, కియరా అద్వానీపై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ లో నటుడు సునీల్ కూడా పాల్గొంటాడు. […]
ఇన్నాళ్లూ గ్యాప్ తీసుకున్న హీరో రామ్ చరణ్ ఇప్పుడు సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈనెల 22నుంచి తన కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమా ఆల్రెడీ లాంఛ్ అయింది. ఇప్పుడా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.
22న పూణెలో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ ను దాదాపు 3 వారాలు ప్లాన్ చేశారు. హీరోహీరోయిన్లు రామ్ చరణ్, కియరా అద్వానీపై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ లో నటుడు సునీల్ కూడా పాల్గొంటాడు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తారు.
దిల్ రాజు కెరీర్ లో 50వ సినిమా ఇది. పైగా దిల్ రాజు కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. అందుకే దీన్ని అతడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను పూర్తిచేసిన తమన్,
అదే జోరులో మరో 2 పాటలు కూడా పూర్తిచేశాడు. శంకర్ తీసిన బాయ్స్ సినిమాతో నటుడిగా
పరిచయమయ్యాడు తమన్. ఇన్నేళ్లకు శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంగీత దర్శకుడిగా పని
చేస్తున్నాడు. గతంలో వైశాలి అనే సినిమాకు వర్క్ చేసినప్పటికీ, అది శంకర్ నిర్మించిన సినిమా. దర్శకత్వం వహించిన సినిమా కాదు.