Telugu Global
National

కేరళలో కారవాన్ టూరిజం..

కారవాన్ అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది అనే భావన అందరిలోనూ ఉంది. హీరోలు, హీరోయిన్లు రెస్ట్ తీసుకునే ప్లేస్, వారు మేకప్ వేసుకుని షూటింగ్ కి రెడీ కావడానికి ఉపయోగపడే ప్లేస్ కారవాన్. సహజంగా దర్శక నిర్మాతలు వీటిని హీరో హీరోయిన్లకోసం సమకూరుస్తుంటారు. ఇటీవల కాలంలో హీరోలే ఎవరికి వారు సొంత కారవాన్లను సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఆ రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు కారవాన్ టూరిజం అనే పేరుతో నూతన […]

కేరళలో కారవాన్ టూరిజం..
X

కారవాన్ అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది అనే భావన అందరిలోనూ ఉంది. హీరోలు, హీరోయిన్లు రెస్ట్ తీసుకునే ప్లేస్, వారు మేకప్ వేసుకుని షూటింగ్ కి రెడీ కావడానికి ఉపయోగపడే ప్లేస్ కారవాన్. సహజంగా దర్శక నిర్మాతలు వీటిని హీరో హీరోయిన్లకోసం సమకూరుస్తుంటారు. ఇటీవల కాలంలో హీరోలే ఎవరికి వారు సొంత కారవాన్లను సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఆ రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు కారవాన్ టూరిజం అనే పేరుతో నూతన విధానాన్ని తెరపైకి తెచ్చింది. పర్యాటకులు వివిధ ప్రదేశాలను చుట్టి రావడంతోపాటు, అక్కడే సేద తీరేందుకు ఉపయోగపడేలా కారవాన్లను రూపొందిస్తోంది. ప్రభుత్వ పర్యాటకరంగంతోపాటు, ప్రైవేటు ఏజెంట్లు కూడా ఈ కారవాన్లను ఉపయోగించేలా ప్రోత్సహిస్తోంది.

విహారం.. విశ్రాంతి.. అన్నీ అక్కడే..
ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళ్లినప్పుడు, ఆయా ప్రాంతాల్లో విహార యాత్రలను ప్లాన్ చేసుకున్నప్పుడు రాత్రి పూట బస చేసేందుకు అనువైన ప్రదేశాలు ఉండవు. పల్లెటూళ్లలో సరైన వసతి ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రకృతి ఒడిలో సేదతీరాలంటే క్రూర మృగాల భయం, దోమలు.. ఇతర సమస్యలు ఉండనే ఉంటాయి. అలాంటి ప్రాంతాలకు కారవాన్లు బాగా అనుకూలంగా ఉంటాయి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లి అలసిపోయి వెంటనే హోటల్ రూమ్ కి తిరిగి రాకుండా కారవాన్ లోనే సేదతీరి వెంటనే మరో ప్రాంతాన్ని సందర్శించే వెసులుబాటు కూడా ఇందులో ఉంటుంది. ప్రయాణంలోనే విశ్రాంతి అనేది ఈ కారవాన్ టూరిజం ప్రత్యేకత.

పర్యావరణానికి హాని లేకుండా..
ప్రస్తుతం కేరళ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న కారవాన్లను పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని అంటున్నారు కేరళ టూరిజం మినిస్టర్ మొహ్మద్ రియాజ్. ప్రతి వాహనంలో మురుగునీటిని శుద్ధి చేసే పరికరాలు ఉంటాయి, ఎక్కడైనా వీటిని సులభంగా పార్కింగ్ చేసుకోవచ్చు. విశ్రాంతితోపాటు, వంట చేసుకోడానికి కిచెన్, ఫ్రిజ్.. బాత్రూమ్ సౌకర్యాలన్నీ అందులోనే ఉంటాయి. పర్యావరణానికి హాని లేకుండా వీటిని తయారు చేయిస్తున్నామని, కేరళ పర్యాటకానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.

ఇకపై కేరళలో కారవాన్ టూరిజం ను ప్రోత్సహించేందుకు వీటికి ప్రత్యేకంగా లైసెన్స్ లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. పర్యాటకులకు పరిశుభ్రమైన వాతావరణం, సెక్యూరిటీని అందిస్తామని అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. దేశంలో కారవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసిన తొలి రాష్ట్రంగా కేరళ పేరు తెచ్చుకుంటుంది.

First Published:  19 Oct 2021 9:51 AM IST
Next Story