డేరా బాబాకు జీవిత ఖైదు
డేరా బాబా సన్నిహితుడు రంజిత్ సింగ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు క్రిష్ణన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్‌లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏడాది క్రితమే మరణించాడు. శిక్షతో పాటు వారికి కోర్టు జరిమానా విధించింది. డేరా బాబాకు రూ.31 లక్షలు, సబ్దిల్ రూ.1.5 లక్షలు, క్రిష్ణన్, జస్బిర్‌లకు రూ.1.25 […]
డేరా బాబా సన్నిహితుడు రంజిత్ సింగ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు క్రిష్ణన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్‌లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏడాది క్రితమే మరణించాడు. శిక్షతో పాటు వారికి కోర్టు జరిమానా విధించింది.
డేరా బాబాకు రూ.31 లక్షలు, సబ్దిల్ రూ.1.5 లక్షలు, క్రిష్ణన్, జస్బిర్‌లకు రూ.1.25 లక్షలు, అవతార్ రూ.75వేలు జరిమానా చెల్లించాలని సూచించింది. ఇందులో 50శాతం డబ్బును రంజిత్ సింగ్ కుటుంబానికి చెల్లించనున్నట్లు పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలోనే హర్యానా పంచకుల కోర్టు ఈ ఐదుగురిని దోషులుగా ప్రకటించింది. తన అనుచరులపై లైంగికదాడి చేశారన్న ఆరోపణలతో డేరా బాబా 2017 నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. డేరా బాబా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొనగా, మిగతవారు ప్రత్యక్షంగా హజరయ్యారు.
తీర్పు నేపథ్యంలో పంచకుల, సిర్సా ప్రాంతాలలో హింస చెలరేగే అవకాశముండడంతో పోలీసులు భద్రతను పెంచారు. డేరా బాబాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యాడు. డేరా బాబా మహిళలను హింసిస్తున్నారని అజ్ఞాత లేఖలో పేర్కొన్నాడనే కారణంతో హత్య చేసినట్లు ఆరోపించారు.