కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట..!
కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. బాధిత కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు. దీనిపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య , ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హత ఉన్న ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలని సీఎం జగన్ అధికారులను […]
కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. బాధిత కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు. దీనిపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య , ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హత ఉన్న ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 30వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.
వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో మరణించినందువల్ల.. ఆయా శాఖల్లో ఎంత మంది చనిపోయారన్న దానిపై వివరాలను రెండ్రోజుల్లో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. వివరాలు అందిన తర్వాత ప్రభుత్వం ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే వైద్య ఆరోగ్యశాఖలో ప్రక్షాళన జరపాలని జగన్ ఆదేశించారు. మెడికల్ కాలేజ్ ల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కరోనా వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు -నేడు కార్యక్రమం ద్వారా వైద్య శాఖలో భారీ మార్పులు చేయాలని.. ఆస్పత్రుల రూపురేఖలు మారిపోవాలని అధికారులకు సూచించారు.