Telugu Global
Cinema & Entertainment

నాగబాబుకు కోట మార్క్ కౌంటర్

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును అనరాని మాటలన్నారు నాగబాబు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ను పొగుడుతూ.. కోటశ్రీనివాసరావు, బాబు మోహన్ లాంటి నటులు నటన విషయంలో ప్రకాష్ కాలిగోటికి కూడా సరిపోరన్నాడు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎట్టకేలకు ఈ వ్యాఖ్యలపై కోట స్పందించారు. తనపై వ్యాఖ్యలు చేసేముందు నాగబాబు ఓసారి అద్దంతో మొహం చూసుకుంటే మంచిదని సూచించారు కోట. తనను కామెంట్ చేయడానికి నాగబాబు అర్హతను ఆయన ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ […]

నాగబాబుకు కోట మార్క్ కౌంటర్
X

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును అనరాని మాటలన్నారు నాగబాబు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ను పొగుడుతూ.. కోటశ్రీనివాసరావు, బాబు మోహన్ లాంటి నటులు నటన విషయంలో ప్రకాష్ కాలిగోటికి కూడా సరిపోరన్నాడు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎట్టకేలకు ఈ వ్యాఖ్యలపై కోట స్పందించారు.

తనపై వ్యాఖ్యలు చేసేముందు నాగబాబు ఓసారి అద్దంతో మొహం చూసుకుంటే మంచిదని సూచించారు కోట. తనను కామెంట్ చేయడానికి నాగబాబు అర్హతను ఆయన ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబు లేరని, ఆయన కేవలం ఓ సాధారణ నటుడన్నారు.

మరోవైపు ”మా” సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇష్టమొచ్చినట్టు వాగడానికి తప్ప ఎలాంటి ఉపయోగం లేని నాగబాబు, ”మా” నుంచి తప్పుకోవడమే మంచిదన్నారు. కోట వ్యాఖ్యలకు సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కుతోంది. తెలుగు సినిమా రంగంలో ఉత్తమ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావును ప్రతి తెలుగువాడు గుర్తించి, గౌరవించాలంటూ సోషల్ మీడియాలో వెల్లువలా పోస్టులు పడుతున్నాయి.

First Published:  18 Oct 2021 4:27 AM IST
Next Story