Telugu Global
CRIME

రోడ్డు ప్రమాదాలన్నీ ఇకపై ఆన్ రికార్డ్..

రోడ్డు ప్రమాదాల వివరాలను రికార్డ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ‘ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్’ ని మెయింటెన్ చేయడానికి తొలి అడుగు వేసింది. ముందుగా ఎంపిక చేసిన ఆరు రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభిస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి ఈ పైలట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ అధికారులు, జాతీయ రహదారుల […]

రోడ్డు ప్రమాదాలన్నీ ఇకపై ఆన్ రికార్డ్..
X

రోడ్డు ప్రమాదాల వివరాలను రికార్డ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ‘ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్’ ని మెయింటెన్ చేయడానికి తొలి అడుగు వేసింది. ముందుగా ఎంపిక చేసిన ఆరు రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభిస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి ఈ పైలట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ అధికారులు, జాతీయ రహదారుల శాఖ అధికారులు, వైద్య శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఇన్సూరెన్స్ విభాగాలను ఇందులో భాగస్వాముల్ని చేస్తారు. ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్నా పెద్ద యాక్సిడెంట్లు అన్నిటి వివరాలు రికార్డ్ చేయాల్సిందే.

యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్పాట్ కి వెళ్లిన అధికారులు వివరాలను సంబంధిత వెబ్ సైట్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రమాదానికి కారణమైన వాహనాలు, వాటి వివరాలు, డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్నాయా లేదా, గోల్డెన్ అవర్ లో బాధితుల్ని ఆస్పత్రులకు చేర్చారా లేదా అనే విషయాలన్నీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన శిక్షణ తరగతులు కూడా జరుగుతున్నాయి.

ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ (IRAD) మొబైల్ యాప్, IRAD వెబ్ సైట్ లో ఈ వివరాలన్నీ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటిలో మార్పులు చేర్పులు చేస్తుంటారు అధికారులు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషించడానికి సరైన డేటాబేస్ అందుబాటులో లేదు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదయితేనా దాని వివరాలు తెలుస్తాయి. ఒకవేళ కేసు నమోదు కాకపోయినా, ఇరు వర్గాలు రాజీ పడినా.. దానికి సంబంధించిన సమాచారమే అందుబాటులో ఉండదు. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ప్రమాదాల సమాచారమంతా ఒకటే యాప్ లో, ఒకే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

First Published:  18 Oct 2021 8:53 AM IST
Next Story