Telugu Global
National

టపాకాయల వ్యాపారం.. మానవతా కోణం..

వాయు కాలుష్యం నేపథ్యంలో భారత్ లో విచ్చలవిడిగా టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లపై సుప్రీంకోర్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలిగించే కొన్ని రకాల టపాకాయల తయారీ, అమ్మకాలను పూర్తి స్థాయిలో నిషేధించారు. మిగతా వాటిని కూడా పరిమితంగా కాల్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు వెసులుబాట్లు ఇచ్చినా.. నాలుగు రాష్ట్రాలు మాత్రం అసలు టపాకాయల అమ్మకాలకు వీలు లేకుండా ఆదేశాలిచ్చాయి. ఢిల్లీ, హర్యానా, ఒడిశా, రాజస్థాన్.. రాష్ట్రాల్లో దీపావళికి […]

టపాకాయల వ్యాపారం.. మానవతా కోణం..
X

వాయు కాలుష్యం నేపథ్యంలో భారత్ లో విచ్చలవిడిగా టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లపై సుప్రీంకోర్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలిగించే కొన్ని రకాల టపాకాయల తయారీ, అమ్మకాలను పూర్తి స్థాయిలో నిషేధించారు. మిగతా వాటిని కూడా పరిమితంగా కాల్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు వెసులుబాట్లు ఇచ్చినా.. నాలుగు రాష్ట్రాలు మాత్రం అసలు టపాకాయల అమ్మకాలకు వీలు లేకుండా ఆదేశాలిచ్చాయి. ఢిల్లీ, హర్యానా, ఒడిశా, రాజస్థాన్.. రాష్ట్రాల్లో దీపావళికి టపాకాయలు నిల్వచేయడం, అమ్మడం పూర్తిగా నిషేధం.

తమిళనాడు సీఎం అభ్యర్థన లేఖలు..
టపాకాయలంటే మొదటిగా గుర్తొచ్చేది తమిళనాడులోని శివకాశి. శివకాశి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 8లక్షలమందికి దీపావళి జీవనోపాధినిస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించడంతో శివకాశి మార్కెట్ పై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అమ్మకాల ఆర్డర్లు నిలిచిపోయాయి, ఉత్పత్తిదారులు చిక్కుల్లో పడ్డారు, ఉపాధి కోసం ఫ్యాక్టరీలకు వెళ్లే కూలీలకు జీవనోపాధి కరవయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ, హర్యానా, ఒడిశా, రాజస్థాన్.. ప్రభుత్వాలకు లేఖలు రాశారు. టపాకాయలపై నిషేధం విధించొద్దని సూచించారు.

మానవతా దృక్పథంతో ఆలోచించండి..
వాతావరణ కాలుష్యాన్ని నివారించడం అందరి బాధ్యతే అయినా.. గ్రీన్ క్రాకర్స్ కి చాలా దేశాలు అనుమతిచ్చాయని, సుప్రీంకోర్టు కూడా గ్రీన్ క్రాకర్స్ విషయంలో నిషేధం విధించలేదని ఆయన తన లేఖల్లో ప్రస్తావించారు. టపాకాయాల వ్యాపారాన్నంతటినీ ఒకే గాటన కట్టొద్దని కోరారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన కాలుష్యాన్ని భారీగా వెదజల్లే టపాకాయల తయారీపై తమ రాష్ట్రంలో నిషేధం ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. కరోనా వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చాలా వరకు కష్టాల్లోకి వెళ్లిపోయాయని, తమిళనాడులో 8లక్షలమంది టపాకాయల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని ఆయన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అభ్యర్థించారు.

First Published:  16 Oct 2021 12:51 AM IST
Next Story