ఢిల్లీలో టపాకాయలు అమ్మితే నేరుగా జైలుకే..
దసరా, దీపావళి పండగలకు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ ని రెచ్చగొట్టినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వాయు కాలుష్యంతో సతమతం అయ్యే ఢిల్లీలో దీపావళితో ఆ కాలుష్యాన్ని మరింతగా పెంచలేమని, శ్వాస కోస వ్యాధులను చేజేతులా ఆహ్వానించలేమని అంటున్నారు అధికారులు. ఢిల్లీలో దీపావళి సందడిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. దేశ రాజధానిలో టపాకాయలు అమ్మడం ఇప్పుడు చట్టరీత్యా నేరం. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ కఠిన నిర్ణయం […]
దసరా, దీపావళి పండగలకు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ ని రెచ్చగొట్టినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వాయు కాలుష్యంతో సతమతం అయ్యే ఢిల్లీలో దీపావళితో ఆ కాలుష్యాన్ని మరింతగా పెంచలేమని, శ్వాస కోస వ్యాధులను చేజేతులా ఆహ్వానించలేమని అంటున్నారు అధికారులు. ఢిల్లీలో దీపావళి సందడిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. దేశ రాజధానిలో టపాకాయలు అమ్మడం ఇప్పుడు చట్టరీత్యా నేరం.
ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. దీపావళి సందర్భంగా టపాకాయల అమ్మకాలకు తాత్కాలిక లైసెన్స్ ల కోసం ప్రతి ఏడాదీ వేలమంది వ్యాపారులు పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ దఫా అలాంటి తాత్కాలిక లైసెన్స్ లు ఇచ్చేది లేదని పోలీసులు తెలిపారు. మరోవైపు శాశ్వత లైసెన్స్ లను కూడా 2022 జనవరి-1 వరకు రద్దు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అంటే ఢిల్లీలో టపాకాయలు నిల్వ చేసినా, అమ్మినా నేరమే అవుతుంది. లైసెన్స్ లేకుండా వస్తువులు అమ్మడం నేరం, అలాంటి వారి వద్ద దొంగతనంగా వాటిని కొనుగోలు చేయడం కూడా శిక్షార్హమేనని హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ సెప్టెంబర్ 28న నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. టపాకాయలు అమ్మడం, కాల్చడంపై ఆంక్షలు విధించింది. దానికి అనుగుణంగా పోలీసులు ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు. తాత్కాలిక లైసెన్స్ లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అటు పర్మినెంట్ లైసెన్స్ లు కూడా రద్దు చేశారు కాబట్టి, పూర్తి స్థాయిలో అమ్మకాలపై నిషేధం విధించినట్టే లెక్క. ఇక గిఫ్ట్ బాక్స్ ల రూపంలో కొరియర్, ఇతర రవాణా మార్గాల ద్వారా నేరుగా ఇంటికే టపాకాయలు తెప్పించుకోవడంపై కూడా నిఘా పెడతామని చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.