పుష్ప నుంచి మరో మంచి పాట
దాక్కో దాక్కో మేక లిరిక్స్ తో ఇప్పటికే పుష్ప నుంచి ఓ సాంగ్ వచ్చింది. ఎంతో అర్థవంతంగా, మరెంతో భావుకతతో వచ్చిన ఆ పాట అందర్నీ ఇట్టే ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా మరో సాంగ్ వచ్చింది. ఈ పాట పేరు “చూపే బంగారమాయనే శ్రీవల్లి”. రష్మిక మందన్నపై చిత్రీకరించిన ఈ శ్రీవల్లి పాటకు అనూహ్య స్పందన వస్తుంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో ఐకాన్ స్టార్ […]
దాక్కో దాక్కో మేక లిరిక్స్ తో ఇప్పటికే పుష్ప నుంచి ఓ సాంగ్ వచ్చింది. ఎంతో అర్థవంతంగా, మరెంతో
భావుకతతో వచ్చిన ఆ పాట అందర్నీ ఇట్టే ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా మరో
సాంగ్ వచ్చింది. ఈ పాట పేరు “చూపే బంగారమాయనే శ్రీవల్లి”.
రష్మిక మందన్నపై చిత్రీకరించిన ఈ శ్రీవల్లి పాటకు అనూహ్య స్పందన వస్తుంది. సెన్సేషనల్ సింగర్ సిద్
శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అద్భుతంగా ఉన్నారు. ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది రష్మిక. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
అల వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి
ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా
తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.