పూజా హెగ్డేకు శుభాకాంక్షల వెల్లువ
ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది పూజా హెగ్డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ మొత్తం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ముందుగా ఆచార్య విషయానికొస్తే, ఈ సినిమాలో నీలంబరి అనే పాత్ర పోషిస్తోంది పూజా హెగ్డే. ఆ పాత్రకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటికీ, పుట్టినరోజు సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఇక రాధేశ్యామ్ సినిమా కూడా ఇదే పద్ధతి ఫాలో అయింది. ప్రభాస్ […]
ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది పూజా హెగ్డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ మొత్తం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ముందుగా ఆచార్య విషయానికొస్తే, ఈ సినిమాలో నీలంబరి అనే పాత్ర పోషిస్తోంది పూజా హెగ్డే. ఆ పాత్రకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటికీ, పుట్టినరోజు సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్.
ఇక రాధేశ్యామ్ సినిమా కూడా ఇదే పద్ధతి ఫాలో అయింది. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే,
ప్రేరణ అనే డాక్టర్ రోల్ చేస్తోంది. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఫస్ట్ లుక్ వచ్చింది. కానీ ఈరోజు మరో
పోస్టర్ రిలీజ్ చేసి, స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు ప్రభాస్.
ఇక పూజాహెగ్డే నటించిన మరో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా 15న థియేటర్లలోకి రాబోతోంది. ఓవైపు ప్రమోషన్ జోరుగా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో పూజా హెగ్డే బర్త్ డే రావడంతో, ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ మరో బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్.