Telugu Global
National

భారత్ లో పిల్లలకోసం రెండో టీకా వచ్చేస్తోంది..

గుజరాత్ కి చెందిన జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్-డి పేరుతో చిన్న పిల్లలకోసం కొవిడ్ టీకా తయారు చేసిన సంగతి తెలిసిందే. దీని అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చినా.. ఇంకా పంపిణీ మొదలు కాలేదు. ఈ నీడిల్ లెస్ టీకాను మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది 12 ఏళ్లు పైబడినవారికి మాత్రమే. భారత్ లో దీని రేటు రూ.1900గా నిర్థారించారు. ఇప్పుడు భారత్ బయోటెక్ కూడా పిల్లలకోసం టీకాను తయారు చేసింది. ఇప్పటికే ఈ […]

భారత్ లో పిల్లలకోసం రెండో టీకా వచ్చేస్తోంది..
X

గుజరాత్ కి చెందిన జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్-డి పేరుతో చిన్న పిల్లలకోసం కొవిడ్ టీకా తయారు చేసిన సంగతి తెలిసిందే. దీని అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చినా.. ఇంకా పంపిణీ మొదలు కాలేదు. ఈ నీడిల్ లెస్ టీకాను మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది 12 ఏళ్లు పైబడినవారికి మాత్రమే. భారత్ లో దీని రేటు రూ.1900గా నిర్థారించారు.

ఇప్పుడు భారత్ బయోటెక్ కూడా పిల్లలకోసం టీకాను తయారు చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ తయారు చేసిన కొవాక్సిన్ 18ఏళ్లు పైబడినవారికి అందుబాటులో ఉంది. దీనికి తోడు 2నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఇచ్చేందుకు కొవాక్సిన్ చిన్న పిల్లల టీకాను తయారు చేసింది. దీనికి అత్యవసర అనుమతులు ఇవ్వాల్సిందిగా నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం అనుమతి ఇస్తే.. కొవాక్సిన్ చిన్నపిల్లల కొవిడ్ టీకా మార్కెట్లోకి వస్తుంది.

ఇటీవల దీనిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని భారత్ బయోటెక్ సంస్థ డీసీజీఐకు అందజేసింది. డీసీజీఐ ఈ నివేదికను పరిశీలించి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం అనుమతి లభిస్తే భారత్‌ లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది. పిల్లలకు ఇచ్చే కొవాక్సిన్ టీకా కూడా రెండు డోసుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇస్తారు.

First Published:  13 Oct 2021 3:56 AM IST
Next Story