Telugu Global
NEWS

థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి..!

ఏపీలో సినిమా థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ ముగిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఒక్క తెలంగాణలో మాత్రమే వంద శాతం ఆక్యుపెన్సీ కి అనుమతి వచ్చింది. ఏపీలో మాత్రం అనుమతి లభించలేదు. దీంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన పలు సినిమాల విడుదల కూడా వాయిదా పడింది. థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని […]

థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి..!
X

ఏపీలో సినిమా థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ ముగిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఒక్క తెలంగాణలో మాత్రమే వంద శాతం ఆక్యుపెన్సీ కి అనుమతి వచ్చింది. ఏపీలో మాత్రం అనుమతి లభించలేదు. దీంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన పలు సినిమాల విడుదల కూడా వాయిదా పడింది. థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని పలుమార్లు సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చింది. దసరా సెలవులు ఉండడం, పండుగ సందర్భంగా పలు కొత్త సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీలో ఈ నెలాఖరు వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అర్ధ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అలాగే సభలు, సమావేశాలు వివాహాలు వంటి శుభకార్యాలకు గరిష్టంగా 250 మంది వరకు అనుమతి ఉంటుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇటువంటి వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు హాజరు కావొచ్చని ప్రభుత్వం తెలిపింది.

First Published:  13 Oct 2021 3:37 PM IST
Next Story