మరో సినిమా రెడీ చేసిన కార్తికేయ
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్ లోకి ఎంటరైంది. రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. రాజా విక్రమార్క కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో గుడిలో కొన్ని […]
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్ లోకి ఎంటరైంది. రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి.
రాజా విక్రమార్క కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో గుడిలో కొన్ని సన్నివేశాలు
ఉన్నాయి. కథ ప్రకారం పురావస్తు శాఖవారు క్లోజ్ చేసిన టెంపుల్ అయ్యి ఉండాలి. లక్కీగా సినిమాకు
గండికోటలో అటువంటి టెంపుల్ దొరికింది. అందులో దర్భార్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. గర్భగుడి వరకు అనుమతి ఇచ్చారు.
మారేడుమిల్లి అందరూ చిత్రీకరిస్తున్న లొకేషన్‌లో కాకుండా… యునీక్ లొకేషన్‌కు వెళ్లి, భారీ రబ్బరు
ఫారెస్టులో కీలక సన్నివేశాలు తీశారు. డంప్ యార్డ్‌లో ప్రీ క్లైమాక్స్ షూట్ చేశారు. మేకింగ్ పరంగా ఎక్కడ రాజీ పడలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత, అతిత్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.