Telugu Global
National

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్సెస్ తమిళనాడు పోలీస్..

తమిళనాడు కోయంబత్తూర్ లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తన తోటి ఉద్యోగినిపై ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ అమితేష్ హర్ముఖ్ అత్యాచారం చేయగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మహిళా కోర్టు సదరు కేసు విచారణ బాధ్యతని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అప్పగించాలని, కోర్టు మార్షల్ ని ఏర్పాటు చేసుకుని వారు విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 30న ఈ ఆదేశాలివ్వగా.. తమిళనాడు […]

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్సెస్ తమిళనాడు పోలీస్..
X

తమిళనాడు కోయంబత్తూర్ లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తన తోటి ఉద్యోగినిపై ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ అమితేష్ హర్ముఖ్ అత్యాచారం చేయగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మహిళా కోర్టు సదరు కేసు విచారణ బాధ్యతని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అప్పగించాలని, కోర్టు మార్షల్ ని ఏర్పాటు చేసుకుని వారు విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 30న ఈ ఆదేశాలివ్వగా.. తమిళనాడు పోలీసులు జిల్లా కోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం తాము కేసు విచారణ చేపట్టామని, సాక్ష్యాధారాలు సేకరించామని చెప్పారు. నిందితుడిని తమ కస్టడీలోనే ఉంచుకుని విచారణ జరుపుతామని దీనికి అనుమతివ్వాలని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బాధితురాలి ఆవేదన..
సెప్టెంబర్ 10న కోయంబత్తూరులోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తన గదిలోకి దూరి అమితేష్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులనుంచి తనపై ఒత్తిడి పెరుగుతోందని కూడా బాధితురాలు చెబుతోంది. వైద్య పరీక్షల విషయంలో కూడా ఎయిర్ ఫోర్స్ తనకు అన్యాయం చేసిందని ఆరోపించింది. లైంగిక దాడి జరిగిందో లోదే తెలుసుకోడానికి చేసే 2-ఫింగర్ టెస్ట్ ని గతంలోనే నిషేధించినా అదే పద్ధతిలో తనకు వైద్య పరీక్షలు చేశారని ఆమె వాపోయింది.

గతంలో జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ కేసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల తీరుని తప్పుబడుతూ ఎయిర్ పోర్స్ చీఫ్ కి లేఖ రాసింది. అయితే మహిళా న్యాయస్థానం కేసు విచారణను ఎయిర్ ఫోర్స్ విభాగానికే అప్పగించడంతో మరోసారి కలకలం రేగింది. బాధితురాలు తనకు అక్కడ న్యాయం జరగదేమో అని అనుమానిస్తున్న క్రమంలో తమిళనాడు పోలీసులు నిందితుడి కస్టడీ విషయంలో జిల్లా కోర్టుని ఆశ్రయించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950లోని సెక్షన్ 124 పై ఇప్పుడు చర్చ మొదలైంది. నిందితుడు, బాధితురాలు ఇద్దరూ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులయితే.. ఆ కేసు విచారణ ఆ విభాగానికే అప్పగించాలనేది ఆ సెక్షన్ సారాంశం. అయితే బాధితురాలు తనకు న్యాయం జరగదేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో మహిళా కోర్టు ఆదేశాలను జిల్లా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేక, నిందితుడిని తమిళనాడు పోలీస్ కస్టడీకి అప్పగిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

First Published:  8 Oct 2021 4:28 AM IST
Next Story