Telugu Global
Cinema & Entertainment

గొర్రెల్ని అలా కంట్రోల్ చేశాడంట

రేపు థియేటర్లలోకి రాబోతోంది కొండపొలం. ఈ సినిమాకు సంబంధించి తన అనుభవాల్ని బయటపెట్టాడు హీరో వైష్ణవ్ తేజ్. చేసింది రెండో సినిమానే అయినప్పటికీ.. కొండపొలంతో చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.. మరీ ముఖ్యంగా రాయలసీమ యాస, గొర్రెలు కాయడం, కొండల్లో ట్రెక్కింగ్ లాంటి అంశాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. – మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తలపొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని తరువాత తెలిసింది. దాంతో ఆ పికిల్స్‌తో వాటిని కంట్రోల్ […]

vaishnav
X

రేపు థియేటర్లలోకి రాబోతోంది కొండపొలం. ఈ సినిమాకు సంబంధించి తన అనుభవాల్ని బయటపెట్టాడు
హీరో వైష్ణవ్ తేజ్. చేసింది రెండో సినిమానే అయినప్పటికీ.. కొండపొలంతో చాలా నేర్చుకున్నానని
చెప్పుకొచ్చాడు.. మరీ ముఖ్యంగా రాయలసీమ యాస, గొర్రెలు కాయడం, కొండల్లో ట్రెక్కింగ్ లాంటి అంశాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు.

– మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తలపొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా
నడుస్తాయి. వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని తరువాత తెలిసింది. దాంతో ఆ పికిల్స్‌తో వాటిని కంట్రోల్
చేయ‌డానికి ట్రై చేశాం.

– రిపబ్లిక్ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్, నేను ఇందులో ఐఎఫ్ఎస్. కానీ రిపబ్లిక్, కొండపొలం సినిమాకు
సంబంధం ఉండదు. అన్నయ్య (సాయి ధరమ్ తేజ్) బాగున్నాడు. త్వరగా కోలుకుంటున్నాడు. ఇప్పుడు
ఫిజియోథెరపీ జరుగుతోంది. తొందర్లనే బయటకు వస్తాడు.

– ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఎంతో ఎత్తుకు ఎదగడమే కొండపొలం కథ. అడవితో
ప్రేమలో పడతాడు. అడవిలాంటి అమ్మాయి ఓబులమ్మ. ఇది చాలా కొత్త కథ. పెద్ద హీరోల సినిమాలు
చూసినప్పుడు నాకు కూడా అలాంటి కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్ అన్న అలా కొడుతున్నాడు..
నాక్కూడా కొట్టాలనిపిస్తుంది. మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త కథలు ఎంచుకోవాలనిపిస్తుంది.

– ఉప్పెనలో ఫిషర్ మ్యాన్ పాత్రను పోషించాను. దానికి తగ్గట్టుగానే నా మేకోవర్ ఉంటుంది. ఇక ఇందులోనూ అంతే రగ్డ్ లుక్‌లోనే కనిపిస్తాను. నా మూడో సినిమాగా కమర్షియల్, లవ్ స్టోరీ చేస్తున్నాను. అందులో నా లుక్ వేరేలా ఉంటుంది.

First Published:  7 Oct 2021 1:43 PM IST
Next Story