Telugu Global
National

కాలుష్య కాసారం ఉత్తర ప్రదేశ్..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. దేశంలోనే అత్యంత ఎక్కువ కాలుష్య ఉద్గారాలను కలిగి ఉన్న రాష్ట్రంగా యూపీ పేరు తెచ్చుకుంది. దాదాపు ఐదు కేటగిరీల్లో.. ఐదింటిలోనూ యూపీయే మొదటి స్థానంలో ఉంది. వాతావరణ కాలుష్యం కారణంగా అక్కడ అనారోగ్య పీడితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (CEEW) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న […]

కాలుష్య కాసారం ఉత్తర ప్రదేశ్..
X

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. దేశంలోనే అత్యంత ఎక్కువ కాలుష్య ఉద్గారాలను కలిగి ఉన్న రాష్ట్రంగా యూపీ పేరు తెచ్చుకుంది. దాదాపు ఐదు కేటగిరీల్లో.. ఐదింటిలోనూ యూపీయే మొదటి స్థానంలో ఉంది. వాతావరణ కాలుష్యం కారణంగా అక్కడ అనారోగ్య పీడితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (CEEW) ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ సర్కారు.. బీజేపీ పాలిత యూపీలో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. గ్యాస్ సిలిండర్ల లెక్కలు బయటకు ఎలా ఉన్నా.. వాతావరణంలో కలుస్తున్న పీఎం2.5 ఉద్గారాలను గమనిస్తే.. ప్రజలు సిలిండర్ల వంటకంటే కట్టెలపొయ్యినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తేలుతోంది. సిలిండర్ రేట్లు ఓ మోస్తరుగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యిని అందరూ పక్కనపెట్టేశారు. ఇప్పుడు బాదుడు భారీగా పెరిగిపోయిన తర్వాత చాలామంది పాత అలవాట్లనే కొనసాగిస్తున్నారు. దీంతో అత్యధిక జనాభా గల యూపీనుంచి పీఎం2.5 ఉద్గారలు పెరిగిపోయాయి.

మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్.. కూడా ఈ లిస్ట్ లో ఉన్నా కూడా ఐదు కేటగిరీల్లో మాత్రం వాతావరణ కాలుష్యంలో ఉమ్మడిగా యూపీ మొదటి స్థానంలో ఉంది. వ్యవసాయ వ్యర్థాల దహనం, పరిశ్రమల ఉద్గారాలు, వాహనాల నుంచి వెలువడే పొగ.. 95శాతం వాయు కాలుష్యానికి ఇవే కారణం. ఇటీవల కాలంలో యూపీ ప్రజలు వంటకోసం గ్యాస్ కి ప్రత్యామ్నాయాలను వెదకడంతో.. వాతావరణంలో పీఎం2.5 ఉద్గారాలు భారీగా పెరిగిపోయాయి.

నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాంపెయినింగ్ ద్వారా 2024 నాటికి 122 పట్టణాల్లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ టార్గెట్ రీచ్ అవుతారనే నమ్మకం లేదు. వాహనాలతో పట్టణ కాలుష్యం పెరిగిపోతుండగా.. పల్లెటూళ్లలో వంటచెరకు అదనంగా చేరింది.

First Published:  7 Oct 2021 3:18 AM IST
Next Story