వైష్ణవ్ తేజ్ కళ్లు చాలా పవర్ పుల్
వైష్ణవ్ తేజ్.. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న నటుడు. ఈ మాట అంటే హీరోయిన్ రకుల్ తేజ్ ఒప్పుకోదు. వైష్ణవ్ ను ఆల్రెడీ స్టార్ అంటోంది. కొండపొలం సినిమాలో వైష్ణవ్ తో కలిసి నటించిన ఈ సీనియర్ హీరోయిన్.. సూపర్ స్టార్ అయ్యే లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయంటోంది. “వైష్ణవ్ తేజ్ భవిష్యత్తులోపెద్ద స్టార్ అవుతాడని అంటారు. కానీ ఆయన ఇప్పటికే స్టార్ అయిపోయాడు. ఆయన కళ్లు చాలా పవర్ ఫుల్. సగం పని కళ్లతోనే పూర్తిచేస్తాడు. మనిషి కూడా ఎంతో ఒద్దికగా […]
వైష్ణవ్ తేజ్.. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న నటుడు. ఈ మాట అంటే హీరోయిన్ రకుల్ తేజ్ ఒప్పుకోదు. వైష్ణవ్ ను ఆల్రెడీ స్టార్ అంటోంది. కొండపొలం సినిమాలో వైష్ణవ్ తో కలిసి నటించిన ఈ సీనియర్ హీరోయిన్.. సూపర్ స్టార్ అయ్యే లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయంటోంది.
“వైష్ణవ్ తేజ్ భవిష్యత్తులోపెద్ద స్టార్ అవుతాడని అంటారు. కానీ ఆయన ఇప్పటికే స్టార్ అయిపోయాడు. ఆయన కళ్లు చాలా పవర్ ఫుల్. సగం పని కళ్లతోనే పూర్తిచేస్తాడు. మనిషి కూడా ఎంతో ఒద్దికగా ఉంటాడు.”
ఇక కొండపొలంలో తన పాత్రపై స్పందిస్తూ.. ఓ నటిగా తను గర్వంగా చెప్పుకునే సినిమాల్లో కొండపొలం
ఒకటిగా నిలిచిపోతుందని అంటోంది రకుల్. చాలా భిన్న పరిస్థితుల మధ్య, కరోనా కల్లోలం మధ్య షూటింగ్ చేసిన ఈ సినిమా తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చింది.
“ప్రతీ నటికి గర్వంగా చెప్పుకునే పాత్ర రావాలని అనుకుంటారు. అలాంటి ఓ క్యారెక్టరే ఓబులమ్మ. ఇలాంటి
పాత్ర ఇచ్చినందుకు, ఆ నమ్మకాన్ని నాపై ఉంచినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రాన్ని చేశాను. నాకు ఈ పాత్రను పోషించడంలో సంతృప్తి దొరికింది. నాకు ఈ పాత్ర ఎంతగా నచ్చిందో.. ప్రేక్షకులకు కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను.”
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది కొండపొలం. క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.