Telugu Global
National

పెట్రోలియం రేట్ల పెరుగుదలపై చేతులెత్తేసిన కేంద్రం..

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వారం రోజుల్లో ఆరో సారి పెట్రోల్ రేటు పెరగగా, రెండు వారాల్లో ఏడుసార్లు డీజిల్ రేట్లు సవరించారు. లీటర్ పెట్రోల్ 110 రూపాయలకు చేరువవుతుండగా.. డీజిల్ సెంచరీ కొట్టేందుకు సిద్ధమైంది. అటు వంట గ్యాస్ ధర కూడా వారం రోజుల్లో విపరీతంగా పెరిగింది. తాజాగా పెరిగిన ధర ఈరోజునుంచి అమలులోకి వస్తోంది. ఈ క్రమంలో పెట్రోలియం ఉత్పత్తుల రేట్లపై తమ ప్రమేయం ఏదీ లేదని కేంద్రం మరోసారి […]

పెట్రోలియం రేట్ల పెరుగుదలపై చేతులెత్తేసిన కేంద్రం..
X

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వారం రోజుల్లో ఆరో సారి పెట్రోల్ రేటు పెరగగా, రెండు వారాల్లో ఏడుసార్లు డీజిల్ రేట్లు సవరించారు. లీటర్ పెట్రోల్ 110 రూపాయలకు చేరువవుతుండగా.. డీజిల్ సెంచరీ కొట్టేందుకు సిద్ధమైంది. అటు వంట గ్యాస్ ధర కూడా వారం రోజుల్లో విపరీతంగా పెరిగింది. తాజాగా పెరిగిన ధర ఈరోజునుంచి అమలులోకి వస్తోంది. ఈ క్రమంలో పెట్రోలియం ఉత్పత్తుల రేట్లపై తమ ప్రమేయం ఏదీ లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రజలపై భారం పడకూడదు అనుకుంటే రాష్ట్రాలు స్థానిక పన్నుల్లో కోత విధించాలని ఉచిత సలహా ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం విధించే పన్నుల తగ్గింపు సాధ్యమయ్యే పని కాదని, రాష్ట్రాలే కాస్త కనికరించాలని కోరారామె.

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత పెరిగిపోయిన దశలో 99శాతం ఇంధన దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాల్లో రేట్ల పెంపు అనివార్యమైంది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగిన ప్రతి సారీ భారత్ లో పెంచాల్సిందే. అయితే అదే సమయంలో కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రేట్లు తగ్గిపోయాయి. అప్పుడు మాత్రం భారత్ లో ఆ ప్రతిఫలాన్ని ప్రభుత్వం జేబులో వేసుకుంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం వల్లే బీజేపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మాత్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పన్నులు తగ్గించుకోవచ్చు కదా అనే సమాధానం వినపడుతోంది.

చేష్టలుడిగిన కేంద్రం..
గతంలో పెట్రోలియం రేట్లు పెరిగిన సమయంలో కేంద్రం తమ ప్రమేయం ఏమీ లేదని తప్పుకుంది. ఆ తర్వాత ఉచిత టీకాలు, ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాం కదా.. వీటన్నిటికీ డబ్బులెక్కడినుంచి వస్తాయనే లాజిక్ లు తీశారు కేంద్ర మంత్రి వర్యులు. తీరా మరోసారి పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెరిగి ప్రజల్లో పూర్తి స్థాయిలో అసహనం పెరుగుతున్న క్రమంలో త్యాగాలు చేయాల్సింది రాష్ట్రాలంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

First Published:  6 Oct 2021 5:48 AM IST
Next Story