త్వరలోనే మంచి రోజులు వస్తున్నాయి
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మహానుభావుడు లాంటి సూపర్ […]
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ నటిస్తున్న సినిమా ఇదే.
టాక్సీవాలా తర్వాత SKN నిర్మిస్తున్న సినిమా ఇది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై మరోసారి సంతోష్ శోభన్ చేస్తున్న సినిమా ఇది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.