అఖండ పని పూర్తిచేసిన బాలయ్య
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న `అఖండ` మూవీ చిత్రీకరణ పూర్తయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీకరణను పూర్తిచేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే దీపావళి బరిలో ఈ సినిమా నిలిచే అవకాశముంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో […]
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'అఖండ' మూవీ చిత్రీకరణ పూర్తయ్యింది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్‌తో చిత్రీకరణను పూర్తిచేసింది యూనిట్. ప్రస్తుతం
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే దీపావళి బరిలో ఈ సినిమా నిలిచే అవకాశముంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఆడియన్స్ పల్స్ తెలిసిన
దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో బాలయ్యను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తపాత్రలో
చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు
బాలకృష్ణ. ఒక పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.