హీరో రామ్ పోతినేనికి గాయాలు
హీరో రామ్ గాయాల పాలయ్యాడు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న టైమ్ లో రామ్ మెడకు గాయమైంది. దీంతో వైద్యులు అతడి మెడకు పట్టీ వేశారు. కొన్ని రోజుల పాటు షూటింగ్స్ కు, వ్యాయామాలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. కృతిషెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం మరింత ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు […]
హీరో రామ్ గాయాల పాలయ్యాడు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న టైమ్ లో రామ్ మెడకు గాయమైంది. దీంతో వైద్యులు అతడి మెడకు పట్టీ వేశారు. కొన్ని రోజుల పాటు షూటింగ్స్ కు, వ్యాయామాలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారు.
లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. కృతిషెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో
రామ్ కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం మరింత ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ క్రమంలో మెడకు గాయమైంది.
రామ్ మెడకు గాయమవ్వడంతో అతడు నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. తన మెడకు గాయమైన విషయాన్ని రామ్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు నెక్ బెల్ట్ పెట్టుకొని దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు.