పవన్ సినిమాపై బాంబ్ పేల్చిన క్రిష్
పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ దేవుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడని, ఒక్కో సినిమా 6 నెలల గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చేస్తుందని కలలుకంటున్నారు. ఇలాంటి వాళ్లందరిపై బాంబ్ పేల్చాడు దర్శకుడు క్రిష్. పవన్ హీరోగా తను చేస్తున్న సినిమా ఇప్పటివరకు కేవలం పాతిక శాతం మాత్రం పూర్తయిందని ప్రకటించి షాక్ ఇచ్చాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ ఏడాది మార్చి 12 వరకు ఈ సినిమా షూటింగ్ […]
పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ దేవుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడని, ఒక్కో సినిమా 6
నెలల గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చేస్తుందని కలలుకంటున్నారు. ఇలాంటి వాళ్లందరిపై బాంబ్ పేల్చాడు
దర్శకుడు క్రిష్. పవన్ హీరోగా తను చేస్తున్న సినిమా ఇప్పటివరకు కేవలం పాతిక శాతం మాత్రం
పూర్తయిందని ప్రకటించి షాక్ ఇచ్చాడు.
క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ ఏడాది మార్చి 12 వరకు ఈ
సినిమా షూటింగ్ జరిగింది. అయితే అప్పటివరకు కేవలం 25 శాతం మాత్రమే షూట్ అయిందని క్రిష్
ప్రకటించాడు. కనీసం ఇంటర్వెల్ వరకు కూడా అవ్వలేదని చెప్పేశాడు.
నవంబర్ రెండో వారం నుంచి హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుందని ప్రకటించిన క్రిష్.. ఆ షెడ్యూల్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు మిగతా సన్నివేశాలు తీస్తానని ప్రకటించాడు. క్రిష్ మాటల బట్టి చూస్తుంటే.. ఈ ఏడాది చివరినాటికి హరిహర వీరమల్లు సినిమా తొలి భాగం పూర్తయ్యేలా ఉంది.